జాతీయ వార్తలు

సైనికుడా... సలాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్/చండీగఢ్, సెప్టెంబర్ 30: పంజాబ్‌లోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దులకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు తమ పంటలు, గొడ్డూ గోదాను వదిలిపెట్టి సరక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చినప్పటికీ ఏమాత్రం బాధపడ్డం లేదు. ఎంతో సంతోషంగా వెళ్లడమే కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరపు దాడి చేసిన మన సైనికులను, పాక్‌కు గట్టి సమాధానం చెప్పినందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తమ ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న ఫాజిల్లా, అమృత్‌సర్, గురుదాస్‌పూర్ తదితర జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల ప్రజలు దేశభక్తి నినాదాలు చేస్తూ డ్యాన్సులు చేశారు. ‘మన సైన్యం మంచి పని చేసింది. ఇనే్నళ్లుగా పాకిస్తాన్ తన దుష్టబుద్ధిని చాటుకుంటూనే ఉంది, కార్గిల్‌నుంచి పఠాన్‌కోట్‌దాకా, ఇప్పుడు ఉరీ ఘటన వరకు ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ పాకిస్తాన్ ఒక్క గుణపాఠం కూడా నేర్చుకోలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని, సైన్యం జరిపిన మెరపుదాడిని మేము స్వాగతిస్తున్నాం’ అని ఫాజిల్కాలోని సరిహద్దు గ్రామస్థుడు అంగ్రేజ్ సింగ్ అన్నాడు.
సరిహద్దు గ్రామాలను తక్షణం ఖాళీ చేయించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించడంతో పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు పది కిలోమీటర్ల పరిధిలోని వెయ్యి గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడం కొనసాగుతోంది. పంజాబ్‌కు పాక్‌తో 553 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా, రాష్ట్రంలోని ఆరు జిల్లాలు సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. లక్షిత దాడుల అనంతరం దాయాది దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిపోవడంతో ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించాలని అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో వీలయినంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్థానిక గురుద్వారాలు, దేవాలయాల చీఫ్‌లు, సర్పంచులు, పోలీసులు లౌడ్‌స్పీకర్ల ద్వారా గ్రామస్థులకు నచ్చజెప్తున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజల్లో కలకలం మొదలైంది. డీజిల్, పెట్రోలు కొనుగోలు చేయడం కోసం గ్రామాల్లో జనం క్యూ కడుతున్నారు. కొందరయితే డ్రమ్ములు కూడా వెంట తీసుకు వస్తున్నారు. అలాగే డబ్బులు డ్రా చేసుకోవడం కోసం జనం ఎటిఎంలకు పరుగులు పెడుతున్నారు.
సరిహద్దు గ్రామమైన డావోకేలో జనం తలపై మూటా ముల్లె పెట్టుకుని తాత్కాలిక శిబిరాలకో, లేదా పట్టణాల్లో ఉంటున్న తమ బంధులు ఇళ్లకో తరలి వెళ్లడం కనిపించింది. గ్రామాల్లో జనం అంతా ఒక్కసారిగా ఖాళీ చేసి వెళ్తుండడంతో సరిహద్దు గ్రామాల రోడ్లపై రద్దీ ఒక్కసారిగా పెరిగి పోయింది. అంతేకాదు చాలా గ్రామాల్లో వయో వృద్ధులు 1965, 71 నాటి భారత్-పాక్ యుద్ధాల గురించి, ఈసారి మన సైన్యం దాడి తర్వాత పాక్ ప్రతీకార దాడులకు దిగుతుందా లాంటి అంశాలను ఆసక్తిగా చర్చించుకోవడం కనిపిస్తోంది. అయితే కోతకు వచ్చిన పొలాలను వదిలిపెట్టి వెళ్లడానికి ఇష్టపడని వాళ్లు కూడా ఈ గ్రామాల్లో చాలామందే ఉన్నారు.

పాకిస్తాన్ సరిహద్దు గ్రామమైన అట్టారీనుంచి తమ నివాసాలను ఖాళీచేస్తున్న ఓ కుటుంబం