జాతీయ వార్తలు

భారత్ సర్వ సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: పాకిస్తాన్ సైన్యం, ఇస్లామిక్ ఉగ్రవాదుల నుండి ఎదురయ్యే దాడిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం సరిహద్దుల్లో సర్వసన్నద్ధంగా ఉందని రక్షణ, హోంశాఖ అధికారులు చెబుతున్నారు. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైనిక మోహరింపు జరిగిపోయిందని వారు చెబుతున్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయనీ, పాకిస్తాన్ ప్రత్యక్ష దాడికి దిగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనక తప్పదని వారంటున్నారు. భారత సైన్యం మోహరింపు పూర్తిగా ఆక్రమిత కాశ్మీర్ కేంద్రంగా జరుగుతోంది, గతంలో పాలకులు చేసిన తప్పు ఈసారి జరగదని వారంటున్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వం అతి స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగుతోంది, భారత సైన్యానికి కూడా స్పష్టమైన సందేశం ఇచ్చారని వారు చెబుతున్నారు. పాకిస్తాన్ ఇంతకాలం చేసిన ఆగడాలు ముఖ్యంగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి, పోషించేందుకు సంబంధించిన పూర్తి వివరాలు, సాక్ష్యాలతో కూడిన సమాచారాన్ని చైనాతోపాటు అన్ని అగ్రదేశాలకు అందజేశారని అంటున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిన పాకిస్తాన్‌ను దారికి తీసుకురాకపోతే మున్ముందు అత్యంత తీవ్ర పరిణామాలు ఎదురవుతాయనీ, ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచ శాంతికే ముప్పుగా మారుతుంది కాబట్టి పరిస్థితులు మరింత దిగజారకముందే పాకిస్తాన్‌ను దారికి తీసుకురావలసిన అత్యవసరాన్ని స్పష్టం చేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు సహకరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం అగ్ర రాజ్యాలతో వాదిస్తున్నట్లు తెలిసింది. పాకిస్తాన్ పరిమిత యుద్ధానికి దిగినా, భారత భూభాగంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం ప్రత్యేక దళాలు లేదా ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి జరిపితే తమవైపు నుండి కూడా ప్రతి దాడులు ఉంటాయి, ఇవి మరింత తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉన్నదని ఎన్‌డిఏ పాలకులు ముఖ్యమైన దేశాల అధిపతులకు వివరించారనే మాట వినిపిస్తోంది.