జాతీయ వార్తలు

‘స్వచ్ఛాగ్రహ’తోనే స్వచ్ఛ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం బడ్జెట్ కేటాయింపులతోనే విజయవంతం కాలేదని, బ్రిటిష్ వలస పాలకుల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు జాతిపిత మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమాన్ని చేపట్టినట్టుగా స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ ‘స్వచ్ఛాగ్రహ’ ఉద్యమాన్ని చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పిలుపునిచ్చారు. రోడ్లపై చెత్త పడివున్న ఫొటోలను చూపిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం విఫలమైందని ప్రచారం చేస్తున్న కొంతమంది వ్యక్తులపై మోదీ నిప్పులు చెరిగారు. తాను స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో కొంతైనా చైతన్యం పెరిగిందని ప్రధాని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి రెండేళ్లు అయిన సందర్భంగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ, ‘రోడ్లపై చెత్త పడి ఉండటంపై కొంత మంది వ్యక్తులు నన్ను ప్రశ్నిస్తున్నారు. అయితే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో కొంత మేరకైనా చైతన్యం పెరగడం స్వాగతనీయం. కనుక ఈ కార్యక్రమాన్ని విమర్శించే వారి ప్రశ్నలను నేను పట్టించుకోను’ అని స్పష్టం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం దైవారాధనతో సమానమని ప్రధాని పేర్కొంటూ, ప్రార్థనా స్థలాల వద్ద ఉత్పన్నమవుతున్న వ్యర్థాలను ఎరువుగా మార్చుకోవడంతో పాటు ఉపాధితో పాటు సంపదను సృష్టించుకోవచ్చని సూచించారు. చెత్తను చూసేందుకు ప్రజలు ఇష్టపడకపోతున్నప్పటికీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ఇంకా అలవాటుగా మార్చుకోలేదని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం రాజకీయ నాయకులకు సులువైన పని కాదని ఆయన అన్నారు. ‘ప్రతి రెండేళ్లకు దేశంలో ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతుంటాయి. ఆ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తర్వాతి ఎన్నికల్లో విజయం కోసం పాకులాడే రాజకీయ నాయకులు, పార్టీలు పరిసరాల పరిశుభ్రత లాంటి కార్యక్రమాలను చేపట్టాలంటే ఎంతో ధైర్యాన్ని, అంతకు మించిన సంకల్పాన్ని కలిగి ఉండాలి’ అని మోదీ పేర్కొన్నారు.

చిత్రం... స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ప్రారంభమై రెండేళ్లు పూర్తయన సందర్భంగా
శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ