జాతీయ వార్తలు

చికిత్సకు స్పందిస్తున్న జయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 2:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని, అయితే మరి కొన్ని రోజుల పాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని అపోలో ఆసుపత్రి ఆదివారం సాయంత్రం ఓ బులిటెన్ విడుదల చేసింది. జ్వరం, డిహైగ్రేషన్‌తో గత నెల 22న జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యంపై తీవ్ర స్థాయి ఆందోళన నెలకొన్న నేపథ్యంలో లండన్‌కు చెందిన అంతర్జాతీయ నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బేలేను పిలిపించారు. ఆయన ఆధ్వర్యంలోనే జయకు చికిత్స జరుగుతోంది. జయకు ఇన్‌ఫెక్షన్ సోకిందని, దాన్ని నయం చేయడానికి అవసరమైన యాంటీబయోటిక్స్ ఇస్తున్నామని, అవసరాన్ని బట్టి చికిత్సలో మార్పులూ చేస్తున్నామని వైద్యులు ఆ బులిటెన్‌లో వెల్లడించారు. జయ పరిస్థితి క్రమంగా మెరుగు అవుతోందని ఆసుపత్రి ప్రధాన నిర్వహణాధికారి సుబ్బయ్య విశ్వనాథన్ తెలిపారు. జయకు ఇప్పటి వరకూ చేసిన చికిత్స వివరాల గురించి తెలుసుకున్న లండన్ నిపుణుడు ఈ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.