జాతీయ వార్తలు

మళ్లీ... పాక్ బోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్‌బందర్, అక్టోబర్ 2:్భరత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో తొమ్మిది మందితో కూడిన పాకిస్తాన్ బోట్‌ను గుజరాత్ తీర ప్రాంతంలో ఆదివారం ఉదయం నౌకాదళం పట్టుకుంది. ఇందులో ఉన్న తొమ్మిది మందిని విచారణ నిమిత్తం పోర్‌బందర్‌కు తరలించారు. ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైనికులు ధ్వంసం చేసినప్పటి నుంచి పాక్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనూ, నిఘా విభాగాలనూ, త్రివిధ దళాలనూ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎనిమిది మంది పాకీస్తానీయులతో కూడిన ఈ బోటు భారత జలాల్లోకి ఉదయం పది గంటల పదిహేను నిముషాలకు ప్రవేశించిందని, సముద్ర జలాలపై నిరంతర నిఘా ముమ్మరం చేసిన తీర రక్షక దళాలు సముద్ర పవక్ నౌక ద్వారా దాన్ని వెంబడించి పట్టుకున్నట్టు రక్షణ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ సంఘటనపై తదుపరి దర్యాప్తు జరుపుతామని, పోర్‌బంద్‌లో వీరిని విచారిస్తామని తెలిపాయి. ఈ బోటులో ఉన్నది పాకిస్తానీ జాలర్లేనని ప్రాథమిక సమాచారంలో స్పష్టమైనప్పటికీ..తదుపరి దర్యాప్తులో వాస్తవాలను నిగ్గు దేలుస్తామని వెల్లడించాయి. తీర ప్రాంతం సమీపంలో అనుమానాస్పదంగా ఎలాంటి నౌక కనిపించినా వెంటనే తమకు సమాచారం అందించాలని స్థానిక జాలర్లను తీరరక్షక దళాలు అప్రమత్తం చేశాయి.

చిత్రం... గుజరాత్ తీరంలోకి దూసుకొచ్చిన పాక్ బోట్‌ను స్వాధీనంలోకి తీసుకుంటున్న నౌకాదళం