జాతీయ వార్తలు

మేము బాధితులం, విలన్లం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 2:కావేరీ జలాల వివాదంలో తమ రాష్ట్రం బాధితురాలే తప్ప విలన్ కాదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉద్ఘాటించారు. ఉద్దేశపూర్వకంగానే తమిళనాడుకు తాము నీళ్లు ఇవ్వడం లేదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా కర్నాటకను విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నమూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరుగుతోందని అన్నారు. గాంధీ, లాల్‌బహదూర్ శాస్ర్తీ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ‘కావేరీ పరివాహక ప్రాంతంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు ఇంతకు ముందు జారీ చేసిన ఆదేశాల ప్రకారంర తమిళనాడుకు గణనీయ పరిమాణంలోనే నీళ్లు విడుదల చేశాం’అని సిద్ధరామయ్య చెప్పారు. కానీ గత నెల 30న సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశం తమను ఇరకాటంలో పడేసిందన్నారు. కావేరీ ప్రాంత ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడమే ప్రాథమిక కర్తవ్యంగా పనిచేస్తున్నామన్నారు. 2017వరకూ ఇబ్బందులు కొనసాగుతాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా నీటి నిల్వలను పెంపొందించుకోవాల్సిన అవసరం తమకు ఎంతో ఉందన్నారు. కాగా, కావేరీ జల నిర్వహణ బోర్డు ఏర్పాటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి టిబి జయచంద్ర చెప్పారు.