జాతీయ వార్తలు

బిహార్‌లో మళ్లీ మద్యనిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, అక్టోబర్ 2: బిహార్ ప్రభుత్వం మద్యాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలను పాట్నా హైకోర్టు కొట్టివేసిన రెండు రోజులకే ప్రభుత్వం తిరిగి గాంధీ జయంతి రోజయిన ఆదివారం మరింత కఠిన నిబంధనలతో కూడిన మద్య నిషేధ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఒకవేళ ఎవరి ఇంట్లోనయినా మద్యం దొరికితే ఆ ఇంట్లోని పెద్ద వారందరినీ అరెస్టు చేసేందుకు వీలుగా ఈ కొత్త నోటిఫికేషన్‌లో నిబంధనలను పొందుపరచింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్) సహా అన్ని రకాల మద్యం విక్రయాలు, వినియోగాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్, 2016ను నోటిఫై చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రత్యేక క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, అతని క్యాబినెట్ సహచరులు రాష్ట్రంలో సానుకూల సామాజిక మార్పుకు దోహదపడుతున్న మద్య నిషేధాన్ని కొనసాగించాలనే నిబద్ధతను వ్యక్తం చేశారు. ఏప్రిల్ 5న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలను కొనసాగించటంతోపాటు మరిన్ని కఠినమైన నిబంధనలను తాజా నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. మద్యం విక్రయదారులకు, వినియోగదారులకు విధించే జైలు శిక్షాకాలాన్ని, జరిమానాను పెంచడంతో పాటు ఎవరి ఇంట్లోనయినా మద్యం బాటిల్ లభిస్తే ఆ ఇంట్లోని పెద్ద వారందరినీ అరెస్టు చేసే నిబంధనను తాజా నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను మామూలుగా క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రిన్సిపల్ కార్యదర్శి బ్రజేశ్ మెహ్‌రోత్రా మీడియాకు వివరిస్తుంటారు. అయితే ఆదివారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించటంతోపాటు విలేఖరులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీకి నిజమైన నివాళులు అర్పించడంలో భాగంగా కొత్త మద్య నిషేధ చట్టాన్ని ఆదివారంనుంచే అమలులోకి తెచ్చినట్టు సిఎం చెప్పారు.

గాంధీజీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో చంపరాన్ సత్యాగ్రహాన్ని చేపట్టి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2017లో శత సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించడం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని నితీశ్ కుమార్ అన్నారు.

పాట్నాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులకు క్రెడిట్ కార్డులను అందజేస్తున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్