జాతీయ వార్తలు

తప్పుడు విధానాలతోనే ఒంటరయిన పాకిస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: జమ్మూకాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి తరువాత పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరి అయిన నేపథ్యంలో ఈ దుస్థితికి కారణం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలే కారణమని మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ విమర్శించారు. పాకిస్తాన్ ఓ వైపు అంతర్జాతీయ సమాజంలో ఒంటరి అయిపోగా, దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కనీసం దేశ ప్రజల అభిమానాన్ని కూడా చూరగొనలేకపోతున్నారు. ‘ప్రభుత్వం 35 బిలియన్ డాలర్ల రుణం తీసుకున్నప్పటికీ, ఆ నిధులతో కనీసం ఒక్క మెగా ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయింది. పైగా ప్రభుత్వ అవినీతి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’ అని పాకిస్తాన్ మాజీ ఆర్మీ జనరల్ కూడా అయిన ముషారఫ్ అన్నట్టు ‘డాన్’ దినపత్రిక ఆదివారం నాటి సంచికలో ప్రచురించింది. అయితే పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న భారత్‌పైనా ముషారఫ్ విరుచుకుపడ్డారు. ‘పాకిస్తాన్.. భూటాన్ కాదని భారత్ గ్రహించాలి. భారత్‌లో ఏ దాడి జరిగిన పాకిస్తాన్‌పై ఆరోపణలు చేయడం అలవాటు’ అని ముషారఫ్ విమర్శించారు. పాకిస్తాన్‌లో అనుసరిస్తున్న తప్పుడు విధానాలను సరిదిద్దడానికి స్వదేశానికి రావాలని కోరుకుంటున్నానని, అయితే ఇప్పుడు తాను వచ్చినా ఉపయోగం లేదని రాలేకపోతున్నానని అన్నారు.

‘నాకు వెనె్నముక సమస్య ఉంది. దానికి చికిత్స తీసుకుంటున్నాను. పాకిస్తాన్‌కు తిరిగి వచ్చినా నన్ను స్వేచ్ఛగా తిరగనివ్వరు కాబట్టి ఉపయోగం లేదు’ అని అన్నారు. తనపై పెట్టిన కేసులన్నీ ముగిసిన తరువాత తాను స్వదేశానికి తిరిగి వస్తానని ముషారఫ్ తెలిపారు.