జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పెరిగిపోతున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని భారత్-సింగపూర్ దేశాలు నిర్ణయించాయి. పరస్పర వాణిజ్య, వ్యాపార లావాదేవీలను పెంచుకునేందుకు పలు ఒప్పందాలూ కుదుర్చుకున్నాయి. మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ సహా మొత్తం మూడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అలాగే వాణిజ్యం, పెట్టుబడులు సహా వివిధ రంగాల్లో పరస్పరం మరింతగా సహకారాన్ని విస్తృతం చేసుకునే అంశాలపై సింగపూర్ ప్రధాని లీతో చర్చించారు. రక్షణ, సహకారం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక మైత్రికి మూలస్తంభాలని పేర్కొన్నారు. పరస్పర చర్చల అనంతరం ఇరు దేశాల ప్రధానులు సంయుక్తంగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శాంతి, మానవత్వ విలువలపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని, ఉగ్రవాద భూతాన్ని తరిమికొట్టాలని మోదీ అన్నారు. సైబర్ భద్రత సహా అన్ని అంశాలపైనా సింగపూర్ ప్రధానితోచర్చించానని, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. రెండూ తీర ప్రాంత దేశాలు కావడం వల్ల ఈ రకమైన సహకారం ఎంతైనా అవసరమని చెప్పారు. ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడంతో పాటు నిరంతర సహకారంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. పేట్రేగుతున్న ఉగ్రవాదం ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం వల్ల ఇరు దేశాలు అనేక రకాలుగా సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. భారత్ తన అభివృద్ధి పథంలో సింగపూర్‌ను అత్యంత కీలక భాగస్వామ్య దేశంగా భావిస్తోందని చెప్పారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్పొరేట్ రూపాయి బాండ్లను సింగపూర్‌లో విడుదల చేయడం భారత వౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మూలధనాన్ని సమకూర్చుకోవడానికి దోహదం చేస్తుందన్నారు. కాగా, ఉగ్రవాద దాడుల్ని తీవ్రంగా ఖండించిన సింగపూర్ ప్రధాని లీ మృత జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. భారత్ పట్ల తమకు ఎంతో విశ్వాసం, నమ్మకం ఉన్నాయని, దాని అభివృద్ధికి శక్తివంచన లేకుండా సహకరిస్తామని చెప్పారు.

చిత్రం... మంగళవారం ఢిల్లీలో జరిగిన సంయుక్త విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని లీ