జాతీయ వార్తలు

రాజ్యసభకు రూపా గంగూలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: నటి, బిజెపి నాయకురాలు రూపా గంగూలీని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు నామినేట్ చేసింది. నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రూపా గంగూలీని నియమిస్తూ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలు జారీచేశారు. 2015లో బిజెపిలో చేరిన రూపా గంగూలీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయిన విషయం విదితమే. 1988లో మహాభారత్ సీరియల్‌లో ద్రౌపదిగా నటించి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రూపా గంగూలీ 1990-2000 మధ్యకాలంలో పలు హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్యసభకు నామినేట్ అయిన సిద్దూ బిజెపి అధినాయకత్వంతో విభేదించి రాజీనామా చేశారు. పెద్దల సభలో అడుగుపెట్టిన మూడు నెలలకే సిద్దూ రాజీనామా చేయడం, ఆవాజ్-ఏ- పంజాబ్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

కోలుకోని కాశ్మీర్
90 రోజులుగా మారని స్థితి
శ్రీనగర్, అక్టోబర్ 4: ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం చెలరేగిన హింసతో అల్లాడిపోతున్న కాశ్మీర్ లోయ దాదాపు 90 రోజులైనా కోలుకోలేదు. ప్రజలు రోజు వారి కార్యక్రమాలు చేసుకోవటానికి ఇంకా జంకు జంకుగానే ముందుకు సాగుతున్నారు. శ్రీనగర్ ప్రధాన కూడలిలో వీధి వ్యాపారులు, బండ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఇప్పటికీ తిరిగి తమ వ్యాపారాన్ని కొనసాగించటానికి బిక్కుబిక్కుమంటున్నారు. కొన్ని చోట్ల మాత్రమే వ్యాపారులు తమ షాపులను తెరుస్తున్నారు. పండ్లు, కూరగాయలు, పళ్ల రసాలు అమ్ముకునే వ్యాపారులు ఎక్కువసేపు తమ వ్యాపారాన్ని కొనసాగించటం లేదు. మార్కెట్ ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇంకా ఆందోళనకర వాతావరణమే ఉంది. పాఠశాలలు, కాలేజీలు మాత్రం తెరుచుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు కూడా పెరిగింది.

గత 88 రోజుల్లో కాశ్మీర్ లోయలో జరిగిన అల్లర్లలో ఇద్దరు పోలీసు అధికారులతో పాటు మొత్తం 83మంది మరణించిన సంగతి తెలిసిందే.