జాతీయ వార్తలు

ఏ సవాలుకైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం లక్షిత దాడులతో ధ్వంసం చేసిన నేపథ్యంలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ అరూప్ రహా మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఎలాంటి సవాలు ఎదురైనా దాన్ని తిరుగులేని విధంగా తిప్పికొట్టేందుకు సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం సైనిక విన్యాసాలు నిర్వహించడం యాదృచ్ఛికమేనని ఆయన స్పష్టం చేశారు. భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులపై మాట్లాడటానికి నిరాకరించిన రహా శతృసైన్యాన్ని చిత్తు చేసే సామర్థ్యం భారత దళాలకు పుష్కలంగా ఉందని స్పష్టం చేశారు. అయితే ఇందుకు సంబంధించి ఏ నిర్ణయమైనా ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పదాతి దళం, వైమానికదళం, నౌకాదళాలు మాత్రం ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు ఆస్కారమే లేదని తెలిపారు. సర్జికల్ దాడులు అత్యంత సునిశితమైనవి కాబట్టి దానిపై మాట్లాడే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని, అందుకే తానేమీ నోరు విప్పడం లేదని తెలిపారు. మీడియా సమావేశంలో తనకు ఈ రకమైన ప్రశ్నలే ఎదురవుతాయన్న విషయం ముందుగానే తెలుసని అన్నారు. ఎలాంటి అత్యవసర బాధ్యతనైనా నిర్వహించేందుకు వైమానిక దళం సిద్ధంగా ఉందని తెలిపారు. సర్జికల్ దాడుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన తొలి త్రివిధ దళాల అధిపతి రహా కావడం గమనార్హం. సర్జికల్ దాడులపై డిజిఎంఓ రణబీర్‌సింగ్ ప్రకటన తప్ప అధికారులెవరూ మాట్లాడకపోవడం గమనార్హం. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంపొందిస్తున్నామని, ఏ దేశాన్నో లక్ష్యం చేసుకుని ఈ ప్రయత్నాలు జరగడం లేదని తెలిపారు. శత్రు దేశం ఏదైనా దాన్ని వ్యూహాత్మక దెబ్బతీయాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న పద్మజా రెడ్డి

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: కూచిపూడి నృత్య కళాకారిణి పద్మజా రెడ్డి 2016 ఏడాదికి గాను సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకొన్నారు. కూచిపుడి నృత్య ప్రతర్శనలో విశేష ప్రతిభ చూపినందుకు కేంద్ర ప్రభుత్వం ఆమెను సత్కరించింది. మంగళవారం నాడు ఢిల్లీలో రాష్టప్రతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా పద్మజా రెడ్డి ఈ అవార్డును అందుకొన్నారు. అనంతరం పద్మజారెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డును అందుకోవడం అనందంగా ఉందని చెప్పారు.

సఫారుూ కర్మచారులకూ
బోనస్ ఇవ్వాలి
జాతీయ కార్యదర్శి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: తెలంగాణలో సింగరేణి బోగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న సఫాయి కర్మచారులకు బోనస్ చెల్లింపులు జరపాలని డిప్యూటి చీఫ్ లేబర్ కమిషనర్ అనిల్ నాయక్‌ను అఖిల భారత సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఎ అప్పారావు విజ్ఞప్తి చేశారు. సింగరేణి బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న 4000 మంది సఫాయి కర్మచారులకు 2014-15, 2015-16 రెండు సంవత్సరాలకు బోనస్ చెల్లింపులకు సంబంధించిన ఆదేశాలు వెంటనే ఇవ్వాలని ఆయన్ని కోరినట్లు అప్పారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బోనస్ చెల్లింపులు సత్వరం జరిపేలా చర్యలు తీసుకుంటానని లేబర్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు కార్యదర్శి అప్పారావు వెల్లడించారు.