జాతీయ వార్తలు

సైనికుల త్యాగాలనే ప్రశ్నిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకుపోయి ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయటం ద్వారా ప్రపంచానికి తమ శౌర్య, సాహసాలను చాటిచెప్పిన భారత సైనికుల త్యాగాలను ప్రశ్నించటం సరైంది కాదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత సైన్యం పిఓకెలో ఎలాంటి మెరుపుదాడులు చేయలేదంటూ పాకిస్తాన్ పాలకులు, దాడులకు సంబంధించి సాక్ష్యాలు వెళ్లడించాలంటూ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీనాయకులు చేస్తున్న డిమాండ్లకు రాజ్‌నాథ్ ఘాటుగా బదులిచ్చారు. హోం మంత్రి మంగళవారం జమ్ముకాశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి భద్రతా చర్యలను సమీక్షించారు. ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేయటం ద్వారా భారత సైనికులు దేశ ప్రతిష్టను పెంచాలని ఆయన ప్రశంసించారు. సైనికులు జరిపిన సర్జికల్ దాడుల గురించి ప్రపంచానికి తెలుసు, అయినా కొందరు వీటిపై అనుమానాలు వ్యక్తం చేయటం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోఫుటేజ్ ఎందుకు విడుదల చేయటం లేదంటూ పాకిస్తాన్ వేస్తున్న ప్రశ్నల గురించి ఒక విలేఖరి గుర్తుచేయగా ‘కొంచెం ఓపిక పట్టండి. ఏమిటనేది మీకే తెలుస్తుంది’అని రాజ్‌నాథ్ అన్నారు. మెరుపుదాడిలో భారత సైనికులు మరణించారంటూ పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ప్రచారాన్ని భారత సైన్యం ఖండించటం తెలిసిందే. ఇదిలాఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి సైనికుల మెరుపుదాడులను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని మంగళవారం కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు మరోసారి ఆరోపించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సర్జికల్ దాడుల సాక్ష్యాలను బహిర్గతం చేసి పాకిస్తాన్ నోరు మూయించాలని డిమాండ్ చేశారు.