జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాక్ రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని, ఏకపక్షంగా విడాకులు ఇచ్చే వారిని శిక్షించాలని, మహిళలకు విడాకులు తీసుకునే హక్కు కల్పించాలని కోరుతూ అఖిల భారత ముస్లిం మహిళా పర్సన్ లా బోర్డు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమవుతోంది. అప్పటికప్పుడు విడాకులు ఇచ్చే పద్ధతి ఖురాన్ నియమాలకు విరుద్ధమని లాబోర్డు అధ్యక్షురాలు షాయిస్తా అంబర్ అన్నారు. మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చే వారిని శిక్షించడం వల్ల ఈ పద్ధతిని కట్టడి చేసినట్టవుతుందని చెప్పారు. విడాకులు తీసుకోవడానికి ముందు భార్యాభర్తల మధ్య పునరాలోచనకు వ్యవధి ఉండాలని ఖురాన్ చెబోతోందని అన్నారు. మూడుసార్లు తలాక్ అన్న వెంటనే విడాకులు ఇచ్చేయడం అన్నది ముస్లిం మహిళలకు వేలాడుతున్న కత్తిలాంటిదేనని చెప్పారు. మహిళలకు విడాకుల హక్కును ఖురాన్ కల్పిస్తున్నప్పటికీ దీనిపై వారిలో విస్తృతమైన అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ట్రిపుల్ తలాక్‌ను సమర్థించినందుకు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డును షాయిస్తా తీవ్రంగా విమర్శించారు. ఉమ్మడి పౌర స్మృతిని తాము వ్యతిరేకిస్తున్నామని, షరీయా చట్టం ఉన్నప్పుడు దీని అవసరం ఎంత మాత్రం లేదని చెప్పారు.