జాతీయ వార్తలు

లాంచ్‌పాడ్‌లలో వందమంది టెర్రరిస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: భారత్, పాకిస్తాన్ వాస్తవాధీన రేఖకు సమీపంలో కనీసం వంద మంది ఉగ్రవాదులు సరిహద్దు దాటేందుకు లాంచ్ పాడ్‌లలో సిద్ధంగా ఉన్నారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక నివేదిక సమర్పించారు. బుధవారం మోదీ అధ్యక్షతన భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కావటానికి ముందే దోవల్ మోదీతో పాటు హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలిసి నిఘా వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని వెల్లడించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సైనికులు లక్షిత దాడులు చేసిన అనంతరం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం రెండోసారి భేటీ అయింది. హోం, విదేశాంగ, రక్షణ మంత్రులు పాల్గొన్న ఈ కీలకమైన సమావేశంలో భారత ఆర్మీ కార్యాచరణను వెల్లడించారు. వాస్తవాధీన రేఖకు ఆవలివైపు మొత్తం 12 లాంచ్‌పాడ్‌లను సైన్యం గుర్తించిందని వారు వెల్లడించారు. గత బుధవారం జరిగిన సర్జికల్ దాడుల్లో పెద్ద సంఖ్యలో మరణాలు జరిగినట్లు డిజిఎంఓ ప్రకటించారు. ఉరీ సెక్టార్‌లో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల దాడి జరిగిన అనంతరం సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి దూసుకెళ్లి ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసి వచ్చిన సంగతి తెలిసిందే. శీతాకాలం వచ్చి సరిహద్దులను మంచు కప్పేనాటికి పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను చొరబరిచి హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు, సైన్యం అంచనా వేస్తున్నాయి.