జాతీయ వార్తలు

చివరి వరకూ కరవుపై కదలరా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ఎలాంటి ఉదాసీతన పనికిరాదని సుప్రీం కోర్టు బుధవారం కేంద్రానికి స్పష్టం చేసింది. గత ఏడాది తప్పులు పునరావృతం కాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరవు కాటక పరిస్థితులు ముంచుకొచ్చే వరకూ ఎదురుచూడకుండా ముందస్తుగానే తగిన సహాయ ఏర్పాట్లతో సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేసింది. ‘మీ ధోరణి ఆందోళన కలిగిస్తోంది. మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. రాబోవే విపత్తుకు ముందుగానే సిద్ధ పడండి. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించండి’అంటూ న్యాయమూర్తులు ఎమ్‌బి లోకూర్,ఎన్‌వి రమణలతో కూడిన సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని హెచ్చరించింది. దేశంలోని కొన్ని జిల్లాల్లో వర్షపాతం తక్కువగా ఉన్నందున కరవు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని, చివరి వరకూ ఏమీ చేయక పోతే పరిస్థితులు చేయిజారిపోయే పరిస్థితీ అనివార్యమవుతుందని తెలిపింది. కరవు పరిస్థితుల్ని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న వాదనలో నిజం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ పిఎస్ నరసింహ వాదించారు.కోర్టు ఆదేశించినట్టుగానే కరవు నివారణ పనులు జరుగుతున్నామని స్పష్టం చేశారు. పిటిషన్ దాఖలు చేసిన స్వరాజ్ అభియాన్ అనే ఎన్‌జివో సంస్థ తరపున వాదించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దేశంలో అనేక జిల్లాల్లో సరైన వర్షపాతం లేదంటూ వాతావరణ విభాగం అందించిన లెక్కల్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు ‘ఈ పాటికి ప్రభుత్వం వద్ద వర్షపాత వివరాలు ఉండి ఉండాలి. ఈ విషయంలో సంబంధిత రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసిందా..’అంటూ అదనపు సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించారు. బీహార్‌లో 12, ఉత్తర ప్రదేశ్‌లో 32,పంజాబ్‌లో 11, గుజరాత్‌లో 13జిల్లాల్లో తగిన వర్షపాతం లేదంటూ తమ వద్ద నివేదికలున్నాయని తెలిపారు. అయితే ఈ రాష్ట్రాలన్నింటికీ రాబోయే కరవు పరిస్థితుల గురించి ముందుగానే తెలిపామని అదనపుసొలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు. కరవు పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ముందుగానే అందుకు సంసిద్ధం కావాలన్నదే తమ ఉద్దేశమని న్యాయమూర్తులు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.