జాతీయ వార్తలు

అన్నింటా చెరగని ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ అణు పితామహుడిగా ఎనలేని సేవలందించి రాష్టప్రతిగా కూడా సమున్నత విలువలు పాదుకొల్పిన అబ్దుల్ కలాం జూలై 27న తుది శ్వాస విడిచారు. తన ఆలోచనలతోనూ, తన జీవన విధానంతోనూ ఇటు యువతనూ, అటు అన్ని తరగతుల వారినీ విశేషంగా ప్రభావితం చేసిన కలాం మరణాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. భారతదేశ 11వ రాష్టప్రతిగా ఆయన పనిచేసిన కాలం చరిత్రలో తిరుగులేనిదిగా నిలిచిపోయింది. ఒకపక్క రాష్టప్రతిగా గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తూనే విద్యాపరమైన అంశాలపట్ల ఆయన కనబరచిన ఆసక్తి ఎందరికో స్ఫూర్తిదాయకమైంది. శాస్తవ్రేత్తగా మంచి ఆలోచన కలిగిన రచయితగా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేయగలిగే విజ్ఞానపటిమ కలిగిన అధ్యాపకుడుగా, అన్నిటికీ మించి భావ స్పష్టత కలిగిన వాగ్ధాటితో అందరినీ మెప్పించిన వ్యక్తిగా అబ్దుల్ కలాం సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. భారత్ ఓ రత్నాన్ని కోల్పోయిందంటూ ప్రధాని తన సంతాపంలో పేర్కొనడమే జాతికి ఆయనపట్ల ఉన్న గౌరవానికి, అభిమానానికి నిదర్శనం.