తెలంగాణ

రేపే కేబినెట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: జిల్లాల పునర్విభజన తుది అంకానికి చేరుకుంది. ముసాయిదాలో ప్రకటించిన జిల్లాతోపాటు ప్రజా విజ్ఞప్తుల మేరకు మరో నాలుగు జిల్లాలు చేర్చి, తుది ముసాయిదా జారీకి రంగం సిద్ధమైంది. ఈలోగా శుక్రవారం సిఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశమై జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనకు ఆమోదం తెలపనుంది. జిల్లాల పునర్విభజనపై సిఎం కెసిఆర్ బుధవారం కూడా కసరత్తు జరిపారు. మంత్రులు, సిఎస్, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్... ఇలా ఎవరెవరు ఏయే జిల్లా ప్రారంభించాలన్న నివేదికనూ ఖరారు చేశారు.
కొత్త జిల్లాలు, డివిజన్లు, మండల కార్యాలయాల నిర్మాణానికి రూ.2 వేల కోట్లు కేటాయించనున్నట్టు సిఎం కెసిఆర్ వెల్లడించారు. వీటిని ఏడాదిలోగా పూర్తి చేయడానికి వచ్చే బడ్జెట్‌లోనే నిధులు కేటాయించనున్నట్టు ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లాల పునర్విభజనపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి సిఎస్ రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ శర్మ హాజరయ్యారు. జిల్లాల పునర్విభజన తర్వాత కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సిఎం ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయాలు పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ద్వారా, ఇతర కార్యాలయాలను ఆర్ అండ్ బి ద్వారా నిర్మిస్తామని సిఎం అన్నారు. దసరా రోజునే అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో అన్ని శాఖలు ప్రారంభించాలని ఆదేశించారు. కొత్త పరిపాలనా విభాగాల్లో పని చేయడానికి అవసరమైన సిబ్బందిని కేటాయించాలని సిఎం ఆదేశించారు. రాజ్యసభ సభ్యుడు కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఏ జిల్లాలోకి ఏయే మండలాలు, డివిజన్లు ఉండాలనే విషయంలో స్పష్టత వస్తుందన్నారు. నివేదిక వచ్చాక డివిజన్లు, మండలాల ఏర్పాటులో చేర్పులు మార్పులు ఉంటాయని సిఎం కెసిఆర్ వివరించారు.

చిత్రం... కొత్త జిల్లాలకు పోలీస్ విభాగాల పరిస్థితిపై సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్