జాతీయ వార్తలు

మైనారిటీ రెసిడెన్షియల్‌కు రూ.500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 5: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ పర్యటనలోవున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బుధవారం కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాంవిలాస్ పాశ్వాన్, రాధామోహన్ సింగ్, మేనకా గాంధీ, నరేంద్రసింగ్ తోమర్, పీపీ చౌదరిలను కలిసి పెండింగ్‌లోవున్న అంశాలు, హామీలు, విజ్ఞప్తులపై చర్చించారు. మంత్రి ఈటలవెంట ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎంపీలు వినోద్‌కుమార్, జితేందర్‌రెడ్డిలు ఉన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో సమావేశమై వివరాలు వెల్లడించారు. మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేయనున్న రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఆర్థిక సాయం అందించాలని మంత్రి నఖ్వీని కోరామన్నారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో చేపడుతున్న మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలను మంత్రికి వివరించామని, తెలంగాణ విధానాన్ని ప్రశంసించిన మంత్రి త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారన్నారు. వినియోగదారులకు అందిస్తున్న సంక్షేమ బియ్యానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన 1640 కోట్లు విడుదల చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌ను కోరామన్నారు. అలాగే సంక్షేమ వసతి గృహాలకు అదనంగా 2400 మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని, దాదాపు ఆరు లక్షల మందికి మేలు జరుగుతుందన్నారు. అలాగే గోదాముల్లో పనిచేసే హమాలీలకు చెల్లించే చార్జీలు ప్రస్తుతం రూ.5గా ఉందని, దాన్ని రూ.12కు చేయాలని కోరామన్నారు. తెలంగాణకు కేంద్ర అలాట్ చేస్తున్న గోధుమలు ప్రస్తుతం కేజీ రూ.6కు ఇస్తున్నారని, దాన్ని రూ.2కు ఇవ్వాలని కోరామన్నారు. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద తెలంగాణకు అదనంగా రూ.600 కోట్లు ఇప్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌కి విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే మేకలు, గొర్రెలకు సంబంధించిన పరిశోధన కేంద్రం ఏర్పాటు, బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరామన్నారు. ఐసీడిఎస్ కేంద్రాల్లో రోజువారీ ఖర్చుకింద పిల్లలకు రూ.15, మహిళలకు రూ.21 ఇవ్వాలని కేంద్ర శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీకి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో 5వేల ఐసీడిఎస్ కేంద్ర భవనాల నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని కోరామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రూ.460 కోట్లమేర పంచాయితీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయని, రోడ్ల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించాలని పంచాయితీ రాజ్ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కి విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే కరీంనగర్, వరంగల్‌లో ఐటి అభివృద్ధికి సహకరించి, కరీంనగర్‌లో ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటుకు మద్దతివ్వాలని ఐటి సహాయ మంత్రి పిపి చౌదరికి విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించి, అండగా ఉంటామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి ఈటల వివరించారు. తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఎంపీలు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ సంతోషం వ్యక్తం చేశారు.

చిత్రం... మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు వినతిపత్రం అందిస్తున్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్