జాతీయ వార్తలు

రాముడుగా మోదీ.. రావణుడిగా షరీఫ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాశి, అక్టోబర్ 5: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో లక్షిత దాడులకు నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాశిలో ‘శ్రీరాముడు’గా దర్శనమిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ‘రావణుడు’గా చిత్రీకరించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రావణుడి కుమారుడు మేఘనాధుడిగా ఆ పోస్టర్‌లో చోటుదక్కించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివసేన రూపొందించిన ఈ పోస్టర్లు బుధవారం వారణాశిలో ప్రత్యక్షమయ్యాయి. పివోకెలో మరోసారి లక్షిత దాడులు చేయాలనే నినాదం కూడా ఈ పోస్టర్లపై ఉంది. శివసేన రూపొందించిన ఈ పోస్టర్లు వారణాశి వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. ఈ పోస్టర్లను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు బస్సులు, ఆటోలపై కూడా అతికిస్తామని స్థానిక శివసేన నాయకుడు అజయ్ చౌబే వెల్లడించారు. చెడుపై మంచి విజయానికి సంకేతంగా విజయదశమిని జరుపుకుంటామనీ, భారత సైన్యం జరిపిన లక్షిత దాడులు కూడా విజయానికి సంకేతమని ఆయన తెలిపారు.
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు దేశీయంగా మద్దతు పలుకుతూ, సైనికదళాలను ప్రశ్నించడం దురదృష్టకరమని చౌబే ఆవేదన వ్యక్తం చేశారు.