జాతీయ వార్తలు

ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష చూపితే జైలుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: హెచ్‌ఐవి, ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారా.. జాగ్రత్త! జైలుపాలవుతారు. ఎయిడ్స్ రోగులు, హెచ్‌ఐవి వైరస్ సోకిన వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి రూపొందించిన చట్టం ముసాయిదాకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించిన సవరణల ప్రకారం ఈ రోగుల పట్ల వివక్షను ప్రదర్శించిన వారికి గరిష్ఠంగా రెండు సంవత్సరాల జైలుశిక్షతో పాటు లక్ష వరకు జరిమానా విధించే వీలుంది. ఎయిడ్స్, హెచ్‌ఐవి రోగుల పట్ల వివక్షను ప్రదర్శించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని విచారించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన నిబంధన కూడా చట్టం ముసాయిలో ఉంది. ‘ద హెచ్‌ఐవి అండ్ ఎయిడ్స్ బిల్, 2014’కు ప్రతిపాదించిన సవరణలను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిడ్స్, హెచ్‌ఐవి రోగులకు వీలయినంత వరకు యాంటిరెట్రోవైరల్ థెరపీని అందించడం తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా తెలిపారు.
మెడికల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం
దేశంలోనే తొలిసారి మెడికల్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఒక ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇక్కడ సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. చెన్నై సమీపంలోని చెంగల్‌పట్టు వద్ద 330.10 ఎకరాల భూమిని వైద్య పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌కు సబ్-లీజుకు ఇవ్వడానికి సంబంధించిన ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. ఇది మెడికల్ టెక్నాలజి రంగంలో దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కావడం విశేషం.
దీనివల్ల తక్కువ ఖరీదులో వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చి, తద్వారా ప్రజలు భరించగలిగే వ్యయంలో వైద్య సేవలను అందించడానికి వీలవుతుందని భావిస్తున్నారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి కూడి ఇది ఊతమిస్తుందని భావిస్తున్నారు.