జాతీయ వార్తలు

పగ్గాలు మరొకరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 7: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉన్న కారణంగా రాష్ట్రంలో అధికార మార్పిడిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం, మరో సీనియర్ మంత్రి పళనిస్వామిలతో అత్యవసరంగా సమావేశమై రాష్ట్రంలో పాలన తీరుపై సమీక్షించటం ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. అంతే కాకుండా జయలలితను పరీక్షించటానికి సింగపూర్‌నుంచి ప్రత్యేక వైద్యుల బృందాన్ని అపోలో ఆసుపత్రి వర్గాలు పిలిపిస్తున్నట్లు సమాచారం. ఒకదశలో జయను సింగపూర్ తరలిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. రెండు వారాలుగా జయ ఆస్పత్రిలో ఉంటుండంతో రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు శుక్రవారం రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులను, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పి రామమోహన రావుతో సమావేశమై రోజువారీ పరిపాలన, ప్రభుత్వ కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ వీరిని ప్రభుత్వ సాధారణ పరిపాలనా విషయాలను అడిగి తెలుసుకున్నట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘రోజువారీ సాగిస్తున్న పరిపాలన, ప్రభుత్వ కార్యకలాపాల గురించి, ఇతర విషయాల గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్‌కు వివరించారు’ అని ఆ ప్రకటన తెలిపింది. కాగా, జయలలిత నమ్మిన బంటు, ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం, మరో సీనియర్ మంత్రి, పిడబ్ల్యుడి శాఖ మంత్రి ఎడప్పాడి కె పళనిసామి కూడా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. గవర్నర్ ఆ ఇద్దరినీ ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని ఆ ప్రకటన తెలిపింది. గవర్నర్ ఈ నెల 1వ తేదీన జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిని సందర్శించి అక్కడి డాక్టర్లను ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి ఆస్పత్రిలో చేరినప్పటినుంచి రాష్ట్ర సీనియర్ మంత్రులు, చీఫ్ సెక్రటరీతో చర్చలు జరపడం ఇదే మొదటిసారి. జయ కేబినెట్‌లో ఆమె తర్వాత కీలక పదవుల్లో ఉన్న మంత్రులతో జరిపిన చర్చల్లో గవర్నర్ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని రాజ్‌భవన్ ప్రకటన తెలిపింది. అలాగే కావేరి సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సాంకేతిక కమిటీ రాష్ట్ర పర్యటనకోసం రానున్న నేపథ్యంలో కమిటీ పర్యటనకోసం చేసిన ఏర్పాట్లు, కమిటీ ముందు రాష్ట్రప్రభుత్వం చేయబోయే వాదన గురించి కూడా గవర్నర్ మంత్రులను అడిగి తెలుసుకున్నారని కూడా ఆ ప్రకటన తెలిపింది.
అమ్మ త్వరలో ఇంటికొస్తారు
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి ఆస్పత్రి పూర్తి వివరాలతో విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ఆమె ఆరోగ్యంపై వస్తున్న అన్ని ఊహాగానాలకు తెరదించుతుందన్న ఆశాభావాన్ని అధికార అన్నాడిఎంకె వ్యక్తం చేస్తూ ఆమె త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న ధీమా వ్యక్తం చేసింది. జయలలితకు ఇస్తున్న మంచి చికిత్సకు సంబంధించి, ఎయిమ్స్, లండన్ డాక్టర్లు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అపోలో ఆస్పత్రి నిన్న విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో వివరంగా తెలియజేసిందని, దీంతో అమ్మకు ఇస్తున్న ట్రీట్‌మెంట్‌పై అనుమానాలన్నిటికీ తెరపడిందని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి అన్నారు. ఈరోజు అపోలో ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కూడా జయలలిత బాగా కోలుకుంటున్నారని చెప్పారని, వాస్తవం ఇదేనని ఆమె అన్నారు.రాహుల్ గాంధీకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్టప్రతి పాలన విధించాలి
ముఖ్యమంత్రి జయ అనారోగ్య కారణాల వల్ల రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగటానికి రాష్టప్రతి పాలన విధించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. అయితే స్వామి డిమాండ్‌ను అన్నాడిఎంకె తోసిపుచ్చింది.