జాతీయ వార్తలు

రాజకీయ ప్రచారానికి వాడుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారత సైన్యాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకోవడాన్ని తాను సమర్థించనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో గల ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన లక్షిత దాడులను నిస్సంకోచంగా సమర్థించిన తాను సైన్యాన్ని రాజకీయ పోస్టర్లలో, రాజకీయ ప్రచారంలో వినియోగించుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఆయన శుక్రవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వరుస సందేశాలలో పేర్కొన్నారు. సైనికుల రక్తం వెనుక దాక్కుంటున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ గురువారం విరుచుకుపడిన విషయం తెలిసిందే. భారత సైన్యం చేసిన వీరోచిన త్యాగాలను మోదీ తన రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. సైనికుల త్యాగాలను ‘దళారి’లాగా దోచుకోవడం చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ ‘దళారి’ అనే పదాన్ని వినియోగించడం పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ పదం ఉపయోగించడం భారత రాజకీయాలలో సరికొత్త ‘దిగజారుడు తనాన్ని’ సూచిస్తోందని పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఇతర పార్టీల నాయకులు కూడా రాహుల్ గాంధీ చేసిన ‘దళారి’ వ్యాఖ్యలను విమర్శించారు. రాజకీయ పార్టీలన్నీ తమ విభేదాలను పక్కన పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంట నిలబడాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. విజయవంతంగా లక్షిత దాడులను నిర్వహించిన ఆర్మీని మరోసారి తాను అభినందిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నందున జాతి యావత్తూ సైన్యానికి మద్దతుగా నిలబడాలని, జాతీయ భద్రతకోసం ప్రధానమంత్రి తీసుకుంటున్న చర్యలకు మద్దతివ్వాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ‘దళారి’ వంటి పదాలను ఉపయోగించకూడదని ఆయన హితవు పలికారు.
మరోవైపు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ బిజెపి నాయకత్వంపై విరుచుకుపడ్డారు. పిఒకెలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యానికి బదులు తామే స్వయంగా లక్షిత దాడులు నిర్వహించినట్లుగా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన శుక్రవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో ఆరోపించారు. ‘బిజెపి వారే లక్షిత దాడులు చేసి ఉంటే, మోదీ, అమిత్ షా, పారికర్, బిజెపి నాయకత్వం అక్కడికి వెళ్లారా?’ అని ఆయన నిలదీశారు. లక్షిత దాడుల ఘనతను మన సైన్యానికి, ధైర్యసాహసాలను ప్రదర్శించిన సైనికులకు ఇవ్వాలని ఆయన హితవు పలికారు.

సర్జికల్ దాడులపై కేజ్రీవాల్, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు