జాతీయ వార్తలు

హజీ అలీ దర్గాలో మహిళల ప్రవేశంపై త్వరలో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రఖ్యాత హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గతంలో తానిచ్చిన స్టేను శుక్రవారం సుప్రీంకోర్టు పొడిగించింది. అక్టోబర్ 17న తదుపరి విచారణ వరకూ స్టే కొనసాగుతుందని అత్యున్నత న్యా యస్థానం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి ఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. కేసును వాయిదా వేయాలంటూ సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం వినతిపై అనుకూలంగా నిర్ణయం తీసుకున్న ధర్మాసనం తాము ఈ విషయంలో ‘ప్రగతిశీల వైఖరి’ని ప్రదర్శిస్తాని పేర్కొంది. ఈ కేసుపై సంక్షిప్తంగా వాదనలు విన్న ధర్మాసనం అన్ని పవిత్ర గ్రంథాలు, శాసనాలు సమానత్వానే్న చాటి చెప్పాయని వ్యాఖ్యానించింది. ‘‘మీరు ఒక గీత వరకు మహిళలను, పురుషులను ఎవరినీ అనుమతించక పోతే ఎలాంటి సమస్యా లేదు. కానీ, ఒకరిని అనుమతించి, మరొకరిని అనుమతించనప్పుడే సమస్య ఉత్పన్నమవుతుంది.’’ అని ధర్మాసనం పేర్కొం ది. ఈ సమస్య కేవలం ముస్లింలలో మాత్రమే కాకుండా హిందువులలో కూడా ఉందని పరోక్షంగా శబరిమలలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ప్రస్తావించింది. గత ఆగస్టు 26న బాంబే హైకోర్టు హజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.