జాతీయ వార్తలు

ఎవరినైనా విచారించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశంలో గృహహింస చట్టం పరిధిని విస్తృతం చేస్తూ సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ చట్టం పరిధిలో ఎవరినైనా విచారించేందుకు వీలుగా ఇందులోని ‘‘అడల్ట్ మేల్ (మేజర్ అయిన పురుషులు)’’ అన్న పదాల్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పదాన్ని తొలగించటం వల్ల ఇకపై ఈ చట్టం కింద మహిళలను, మేజర్ కానివాళ్లను కూడా విచారించేందుకు అవకాశం లభిస్తుంది. వివాహిత మహిళకు అత్తవారింట్లో ఎదురయ్యే వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్న 2005 గృహహింస చట్టంలో సెక్షన్ 2(క్యు)లోని రెండు పదాలను తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ‘‘స్ర్తి, పురుషులు, పెద్ద, చిన్నల మధ్యన చాలా సూక్ష్మమైన తేడా ఉంది. ఈ చట్టంలోని 2(క్యు) నిబంధన ప్రకారం రెస్పాండెంట్ అంటే బాధిత వ్యక్తితో సంబంధం ఉన్న మేజర్ అయిన పురుషుడు అని పేర్కొన్నారు. చట్టం లక్ష్యం చేరుకోవటానికి ఈ పదాలు అడ్డంకిగా మారుతున్నాయి. అందుకే గృహహింస చట్టంలోని వయసు, లింగంతో భేదం లేకుండా ఎవరినైనా విచారించేందుకు వీలుగా ఈ పదాలను తొలగించాలి’’ అని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్. ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. గృహహింస అంటే వివాహిత మహిళకు కేవలం పురుషుల నుంచే కాకుండా, ఏ రూపంగా నైనా ఎదురయ్యే హింస అని, దీన్నుంచి ఆమెను కాపాడటమే ఈ చట్టం లక్ష్యమని న్యాయమూర్తులు 56 పేజీల తమ తీర్పులో వ్యాఖ్యానించారు. ‘‘పదహారు, పదిహేడేళ్ల వయసున్న కుటుంబ సభ్యులు గృహహింస కార్యకలాపాలకు పాల్పడబోరని అనుకోవటానికి వీల్లేదు. బాధితురాలు ఉంటున్న ఇంట్లో మైనర్ ఉన్నట్లయితే, ఆ మైనర్ బాధితురాలిపై వేధింపుల్లో సహకరించినట్లు అనుమానం ఉన్నా ఆ మైనర్‌ను సెక్షన్ 19(1)(సి) ప్రకారం నిందితుడిగా చేర్చాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.