జాతీయ వార్తలు

కాంగ్రెస్, ఎస్పీలకు ఓటేస్తే వృథాయే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 10: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ (ఎస్‌పి) పార్టీలకు ఓట్లేస్తే వృథాయేనని బహజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. బిఎస్‌పి వ్యవస్థాపకుడు కాన్షీరామ్ 10వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం లక్నోలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాయావతి ముస్లిం ఓటర్లపై దృష్టి సారించారు. యుపిలోని ప్రతి నియోజకవర్గంలో దాదాపు 23 శాతం ఉన్న దళిత ఓటర్లను ఆకట్టుకోవడంతోపాటు ముస్లింలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలు సమాజ్‌వాది (ఎస్‌పి), కాంగ్రెస్‌కు ఓట్లేసి తమ ఓట్లను వృథా చేసుకోవద్దని, ఆ పార్టీలకు ఓటేస్తే పరోక్షంగా బిజెపి లాభపడుతుందని విశే్లషించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపుతోందని, వారిపై మతపరమైన దాడులు పెరిగిపోయాయని, ఇదే సమయంలో వారు ఎస్‌పికి, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేసి, పరోక్షంగా బిజెపికి సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు. పనిలోపనిగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎస్‌పిపైనా విమర్శల వర్షం కురిపించారు. ముజఫర్‌నగర్, దాద్రి, మదుర, బులంద్‌షహర్ లాంటి సంఘటనలు పెచ్చరిల్లాయని, శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. ఎస్‌పిలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన పినతండ్రి శివపాల్ యాదవ్‌ల మధ్య అధికారంకోసం కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయని, పరిపాలనపై పట్టు కోల్పోయారని అన్నారు.
ర్యాలీలో తొక్కిసలాట: ఇద్దరు మృతి
లక్నోలోని కాన్షీరామ్ స్మారక మైదానంలో నిర్వహించిన ర్యాలీకి జనం భారీగా తరలివచ్చారు. అయితే ర్యాలీ అనంతరం తిరిగి బయటకు వెళ్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, దాదాపు 12 మంది గాయపడ్డారు. మృతిచెందినవారిలో శాంతి దేవి (68) కాగా, మరో మహిళ వివరాలు తెలియాల్సి వుందని పోలీసులు తెలిపారు.

లక్నోలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న బిఎస్‌పి అధినేత్రి మాయావతి. ర్యాలీ అనంతరం తిరిగి వెళ్లిపోతున్న దృశ్యం