జాతీయ వార్తలు

మరిన్ని మెరపు దాడులు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులు ఇలాగే కొనసాగితే మెరుపుదాడులు తప్పవని ఎన్డీయే సర్కారు పాకిస్తాన్‌కు గట్టి సందేశం పంపించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసి) ప్రాముఖ్యత కోల్పోతుందని కేంద్రం ఇటీవల పాక్‌కు పంపిన సందేశంలో స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. గత 20 రోజుల్లో నాలుగు ఉగ్రవాదదాడులు జరిగాయి, వారంతా ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చినవారేనని ఎన్డీయే సర్కారు పాక్‌కు పంపిన సందేశంలో పేర్కొంది. పాక్ సైన్యం తోడ్పాటు లేకుండా వీరంతా వాస్తవాధీన రేఖ దాటి భారత భూభాగంలోకి వచ్చే అవకాశం లేదని కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. ఇస్లామిక్ ఉగ్రవాదులను అదుపుచేయని పక్షంలో మెరుపుదాడులు తప్పవనేది పాక్‌కు పంపిన సందేశ సారాంశమని సీనియర్ అధికారులు చెబుతున్నారు. సీమాంతర ఉగ్రవాదం కొనసాగుతుంటే తాము వాస్తవాధీన రేఖను దాటకుండా ఉండలేమని ఎన్డీయే ప్రభుత్వం అంటోంది. ‘పాక్ ప్రభుత్వం వాస్తవాధీన రేఖను దుర్వినియోగం చేస్తోంది. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు భారత మెరుపుదళాలు కూడా అవసరం మేరకు ఆధీన రేఖ దాటుతాయని రక్షణ శాఖ అధికారులు అంటున్నారు. కార్గిల్ యుద్ధంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల రూపంలో వచ్చిన పాక్ రెగ్యులర్ సైనికులు మనకు చెందిన కొండలు, గుట్టలు ఆక్రమించినప్పుడూ భారత సైన్యం వాస్తవాధీన రేఖ దాటలేదు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం ఆదేశాల మేరకు మన సైనికులు వాస్తవాధీన రేఖ దాటకుండానే కార్గిల్ కొండల నుంచి పాక్ సైనికులను పారదోలారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడిందుకు భిన్నంగా దెబ్బకు దెబ్బ కొట్టటం ద్వారా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అదుపు చేయాలని అనుకుంటోంది. పాక్ మాటిమాటికీ వాస్తవాధీన రేఖ నుంచి ఇస్లామిక్ ఉగ్రవాదులను భారత దేశంలోకి పంపిస్తుంటే, ఆక్రమిత కాశ్మీర్‌లో తిష్ట వేసే ఉగ్రవాదులను హతమార్చే అధికారం తమకు ఉంటుందని ఎన్డీయే ప్రభుత్వం వాదిస్తున్నట్టు తెలిసింది. వాస్తవాధీన రేఖను పాక్ గౌరవించనప్పుడు తామెందుకు గౌరవించాలని కేంద్రం వాదిస్తోంది. భారత సైన్యం జరిపిన మెరపుదాడికి ప్రతిగా పాక్ గత ఇరవై రోజుల్లో ఐదారు చొరబాట్లు చేయించింది. ఒకవైపు ఉద్రిక్తతలు వద్దని చెబుతూనే మరోవైపు నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను జరిపిస్తోంది. ఈ పరిణామాలను లోతుగా పరిశీలిస్తే పాక్ సైన్యం ప్రతి దాడులకు సిద్ధమవుతోందని భావించక తప్పదని అంటున్నారు. పాక్ సైన్యాధ్యక్షుడు రాహీలీ షరీఫ్ గత వారం వాస్తవాధీన రేఖవద్ద సైనిక మొహరింపును తనిఖీ చేయటం తెలిసిందే. భారతదేశంనుంచి ఇకమీదట ఎదురయ్యే మెరుపు దాడులను ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం సిద్ధం అవుతోందనేందుకు రాహిల్ షరీఫ్ పర్యటన నిదర్శమని రక్షణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాహిల్ షరీఫ్ సైన్యాధ్యక్ష పదవీ కాలం నవంబర్‌తో ముగుస్తుంది. పాక్ సైన్యాధ్యక్షుడు రాహీల్ షరీఫ్ పదవీకాలాన్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పొడిగించే పక్షంలో పాక్ సైన్యం ఎల్‌వోసి వద్ద దాడికి దిగే అవకాశాలు ఉన్నట్టు భావించాల్సి ఉంటుందని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. పాక్‌నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడినైనా తిప్పికొట్టటంతోపాటు ఆక్రమిత కాశ్మీర్‌లో మెరుపుదాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉన్నదని హోం, రక్షణ శాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.