జాతీయ వార్తలు

పాక్‌పైనే బ్రిక్స్ గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెనౌలిం (గోవా), అక్టోబర్ 14: ఉగ్రవాదమే విధానంగా పెట్టుకున్న పాకిస్తాన్‌ను మరింతగా ఏకాకిని చేసే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేస్తోంది. ఉరీ దాడి నేపథ్యంలో సార్క్ దేశాల నుంచి పూర్తిస్థాయి మద్దతు పొందిన భారత్ ఇప్పుడు బ్రిక్స్ సదస్సు వేదికగా పాక్ ఉగ్ర ధోరణిని తీవ్రస్థాయిలో ఎండగట్ట బోతోంది. పాకిస్తాన్‌పై సార్క్ దేశాలు ఏ విధంగా విరుచుకు పడ్డాయో అదే స్థాయిలో బ్రిక్స్ దేశాల మద్దతునూ చూరగొనడం ద్వారా ఉగ్రవాద వ్యతిరేక పోరును మరింతగా బలోపేతం చేయాలని భావిస్తోంది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న ఐదు సార్క్ దేశాల రెండు రోజుల వార్షిక శిఖరాగ్ర సదస్సు శనివారం ఇక్కడ ప్రారంభం కాబోతోంది. సభ్య దేశాలైన బ్రెజిల్ నేతలు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌లు హాజరవుతున్న దృష్ట్యా ఈ శిఖరాగ్ర సదస్సుకు అంతర్జాతీయ ప్రాముఖ్యత ఏర్పడింది. ఉగ్రవాద పోరును మరింత సంఘటితం చేయడానికి, దీనిపై సమగ్ర రీతిలో అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన అవసరాన్ని మరింతగా స్పష్టం చేయడానికి ఈ సదస్సును దౌత్యపరంగా భారత్ ఉపయోగించుకోబోతోంది. ఉగ్రవాద ముప్పు, ద్వైపాక్షిక వ్యాపార వాణిజ్యాన్ని విస్తృతం చేసుకోవడం సహా అనేక అంశాలపై ఈ శిఖరాగ్ర సదస్సులో లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి లక్ష్యాల సాధనలో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఏ విధంగా అధిగమించాలన్న దానిపై ఈ సదస్సు చర్చిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి, అభివృద్ధి, శాంతి, సుస్థిరత, సంస్కరణల లక్ష్యాలను సాధించడానికీ ఈ సదస్సు దోహదం చేయగలదన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. బ్రిక్స్ సదస్సుకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా సభ్య దేశాల నేతలతో మోదీ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిరోధన, నిర్మూలనపై ఆయన చర్చించే అవకాశం ఉంది.
బ్రెజిల్,రష్యా,్భరత్,చైనా, దక్షిణాఫ్రికా దేశాల ఉమ్మడి జనాభా 3.6బిలియన్లు కాగా, ఉమ్మడి స్థూల జాతీయోత్పత్తి 16.6ట్రిలియన్లు. ఇంత విస్తృత ఆర్థిక, రాజకీయ, వాణిజ్య శక్తి కలిగిన బ్రిక్స్ దేశాల మధ్య ఐక్యతను సాధించడం ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందానికి (సిసిఐటి) ఐరాస ఆమోదం సాధించాలని భారత్ భావిస్తోంది. భారత్ ప్రతిపాదించిన ఈ ఒప్పంద ప్రతిపాదన సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఐరాసలో ఆగిపోయింది.

చిత్రం....బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో గోవాలో భద్రతా తనిఖీలు