జాతీయ వార్తలు

ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంతకాలం చర్చలుండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: భారత్‌కు చిత్తశుద్ధి ఉంటే కాశ్మీర్ సమస్యను చర్చలద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చేసిన ప్రతిపాదనను విదేశీ వ్యవహారాల శాఖ కొట్టివేసింది. షరీఫ్ శనివారం ఉదయం అజర్‌బైజాన్‌లోని బకు పట్టణంలో పాకిస్తానీ జర్నలిస్టులకు ఇచ్చిన అల్పాహార విందు సందర్భంగా ఈ ప్రతిపాదన చేశారు. నవాజ్ షరీఫ్ మూడు రోజుల పర్యటనకోసం అజర్‌బైజాన్ వచ్చారు. విదేశీ వ్యవహారాల సీనియర్ అధికారి ఢిల్లీలో మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత కాలం రెండు దేశాల మధ్య అర్థవంతమైన చర్చలు జరగవని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు చిత్తశుద్ధి ఉంటే మొదట ఉగ్రవాదానికి తెర దించాలని అన్నారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ మరోవైపు కాశ్మీర్‌ను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటే కుదరదని అన్నారు. నవాజ్ షరీఫ్ శనివారం ఉదయం విలేఖరులతో మాట్లాడుతూ కాశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ అంశంతోపాటే చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌పై జరుగుతున్న పని గురించి ప్రస్తావించారు. కారిడార్ నిర్మాణం వేగంగా జరుగుతోందని ఆయన చెప్పారు.