జాతీయ వార్తలు

మీకు భారత్ రెండో పుట్టినిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దాదాపు అర్ధశతాబ్దం పాటు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్ ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యం, అభివృద్ధి వైపు పయనం మొదలుపెట్టిన నేపథ్యంలో భారత్ ఆ దేశానికి తిరుగులేని మద్దతును ప్రకటించింది. మరోవైపు భద్రత, వాణిజ్యంతో పాటుగా వివిధ రంగాల్లో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. మన దేశంలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన మయన్మార్ అగ్రనేత ఆంగ్‌సాన్ సూకీ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం ఇరుపక్షాలు విద్యుత్, బ్యాంకింగ్, బీమా రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి మూడు ఒప్పందాలను కుదుర్చుకోవడంతో పాటుగా చమురు, గ్యాస్, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధన వనరులు, వైద్య సేవల రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన చరిత్రాత్మక ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ ఘన విజయం సాధించి సైనిక పాలకులనుంచి అధికారాన్ని దక్కించుకున్న తర్వాత సూకీ భారత్ రావడం ఇదే మొదటిసారి. చర్చల అనంతరం జరిగిన ఇరువురు నేతల సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేస్తూ భారత్‌ను సూకీకి రెండో పుట్టినిల్లుగా అభివర్ణించారు. మీ నేతృత్వంలో భారత్, మయన్మార్ స్నేహ, సహకారాలు మరింత సుదృఢం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. భారత్, మయన్మార్‌ల స్నేహం ఈ నాటిది కాదన్న ప్రధాని.. ఆ దేశానికి భారత్ సహాయ సహకారాలు ఎప్పటికీ కొనసాగుతాయని అన్నారు. సూకీ ఢిల్లీ యూనివర్శిటీనుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాగా, సూకీ తన ప్రసంగంలో మహాత్మాగాంధీ, జవహర్‌ల్ నెహ్రూ పేర్లను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యం కోసం జరిపిన పోరాటంలో మయన్మార్ ఈ ఇరువురు నేతలనుంచి ఎంతో స్ఫూర్తి పొందిందన్నారు. సన్నిహిత సంబంధాలు కలిగిన పొరుగుదేశాలుగా రెండు దేశాల భద్రతా ప్రయోజనాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని ప్రధాని అన్నారు. సరిహద్దు వెంబడి భద్రత, ఒక దేశం వ్యూహాత్మక ప్రయోజనాలను మరో దేశం అర్థం చేసుకోవడం వల్ల రెండు దేశాలకు మేలు జరుగుతుందనే విషయాన్ని రెండు దేశాలు అంగీకరించాయని చెప్పారు. ‘మీ నేతృత్వంలో మయన్మార్ ఓ ఆధునిక, భద్రమైన, ఆర్థికంగా సంపన్నమైన దేశంగా తయారు కావడానికి, భారత దేశం, దాని స్నేహం మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాయని హామీ ఇస్తున్నాను’ అని మోదీ అన్నారు.

బుధవారం ఢిల్లీలో సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న
మయన్మార్ విదేశాంగ మంత్రి సూకీ, భారత ప్రధాని నరేంద్రమోదీ