జాతీయ వార్తలు

అవి వట్టి అరుపులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 19: చైనా వస్తువులను భారత్‌లో బహిష్కరించాలని సామాజిక మాధ్యమంలో కొంతమంది ఇచ్చిన పిలుపుపై స్పందిస్తూ భారతీయ వస్తువులు చైనా వస్తువులతో పోటీ పడలేవని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ తన బుధవారం సంచికలోని ఓపెన్ ఎడిట్ పేజీలో ప్రచురించిన ఒక కథనంలో భారత్ కేవలం ‘మొరగగలుగుతుంద’ని, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య లోటుపై ఏమీ చేయజాలదని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న కొంతమంది ఉగ్రవాదులను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటింపచేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా ఎల్లవేళలా అడ్డుకుంటున్నందున ఆగ్రహం చెందిన కొంతమంది భారతీయులు చైనా వస్తువులను బహిష్కరించాలని సామాజిక మాధ్యమంలో పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ‘ఆచరణ సాధ్యం’ కానిదని కూడా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టకూడదని చైనా కంపనీలకు ఆ దినపత్రిక సూచించింది. విచ్చలవిడి అవినీతి, కష్టపడి పనిచేయని ఉద్యోగులు ఉన్న భారత్‌లో పెట్టుబడులు పెట్టడం ‘ఆత్మహత్యాసదృశం’ అవుతుందని హెచ్చరించింది. ‘చైనా వస్తువుల బహిష్కరణ గురించి భారతీయ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఇటీవలి కాలంలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. అది భావోద్వేగాలు, దురభిమానంతో కూడుకున్న చర్చ తప్ప మరోటి కాదు’ అని గ్లోబల్ టైమ్స్ విమర్శించింది. ‘వివిధ కారణాల రీత్యా భారత్ తయారు చేసిన వస్తువులు చైనా ఉత్పత్తులతో ఎప్పుడూ పోటీ పడజాలవు’ అని కూడా పేర్కొంది. భారత్ ఇప్పటికీ రోడ్లు, జాతీయ రహదారులు నిర్మించుకోవలసిన పరిస్థితుల్లో ఉందని, విద్యుత్ సరఫరా, నీటి సరఫరాలో ఎడతెగని కొరత ఉందని పేర్కొంది. భారత్ అమెరికాను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తింది. అయితే అమెరికా ఎవరికీ మిత్రదేశం కాదని, అమెరికా కేవలం చైనాను అడ్డుకోవడానికే భారత్‌తో సన్నిహితంగా మెలగుతోందని, చైనా అభివృద్ధి చెందుతుండటం పట్ల, ప్రపంచ శక్తిగా ఎదుగుతుండటం పట్ల అమెరికా ఈర్ష్య చెందుతోందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.