జాతీయ వార్తలు

నేను రెడీ.. కానీ రావచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కేరళకు చెందిన సౌమ్య రేప్ కేసులో తమ ముందు హాజరై తామిచ్చిన తీర్పులో అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఇచ్చిన సమన్లను తాను స్వాగతిస్తున్నానని జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు.
కోర్టుకు హాజరై తన అభిప్రాయాలను వెల్లడించటానికి సిద్ధంగా ఉన్నానని, అయితే రాజ్యంగంలోని 124(7) సెక్షన్ ప్రకారం ఒక మాజీ న్యాయమూర్తిగా తాను హాజరయ్యేందుకు వీలులేదని ఆయన అన్నారు. త్రిస్సూర్‌కు చెందిన సౌమ్య అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ప్రాథమిక లోపాలు ఉన్నాయంటూ కట్జూ చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ‘‘బహిరంగ న్యాయస్థానంలో ధర్మాసనం ముందు హాజరై నా అభిప్రాయాలను వెల్లడించటం నాకు సంతోషమే. అయితే రాజ్యాంగంలోని 124(7) సెక్షన్ నన్ను కోర్టుముందు హాజరు కాకుండా అడ్డుకట్ట వేస్తున్నది. న్యాయమూర్తులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారా లేదా అన్నది నాకు తెలియదు. అయినా నన్ను హాజరు కమ్మంటే నేను వెళ్లి నా అభిప్రాయాలను వెల్లడిస్తా’’ అని కట్జూ తెలిపారు. ‘సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఏ వ్యక్తి కూడా భారత దేశ సరిహద్దుల్లోని ఏ కోర్టు ముందు కానీ, ఏ న్యాయాధికారి ముందు కానీ హాజరు కావలసిన అవసరం లేదు’ అని 124(7) అధికరణం చెప్తోంది. జస్టిస్ కట్జూ ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ సౌమ్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు నుంచి అధికారికంగా ఇంకా నోటీసులు అందలేదన్నారు. కేరళ ప్రభుత్వ న్యాయవాది ఈ విషయాన్ని వెల్లడించారని పేర్కొన్నారు.
2011్ఫబ్రవరి 1న త్రిస్సూర్‌లో సౌమ్య అనే మహిళను గోవిందచామీ అనే వ్యక్తి నడుస్తున్న రైల్లోంచి తోసేసి, తానూ దూకి గాయాలతో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసాడు. ఈ కేసులో దోషికి స్థానిక కోర్టు మరణ శిక్ష విధించగా సుప్రీం కోర్టు దాన్ని జీవిత ఖైదుగా మార్చింది. సుప్రీం తీర్పును కట్జూ తప్పుపట్టడంతో సమన్లు జారీ అయ్యాయి.