జాతీయ వార్తలు

తప్పనిసరి ఓటింగ్ అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దేశంలో నిర్బంధ ఓటు విధానాన్ని అమలు చేయటం కార్యాచరణలో సాధ్యం కాని పని అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీ బుధవారం అన్నారు. లోక్‌సభలో ఇదే డిమాండ్‌ను ప్రభుత్వం గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తిరస్కరించింది. ‘‘తప్పని సరి ఓటింగ్ విధానం అనేది కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. కానీ, మన దేశంలో వాస్తవంగా అమలు చేయాల్సి వచ్చేసరికి అంత సాధ్యం కాదు. అయితే ఈ అంశంపై చర్చ జరగటం ఆహ్వానించదగ్గ పరిణామమే’’ అని నజీం జైదీ అన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన అంతర్జాతీయ ఓటరు చైతన్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తప్పనిసరి ఓటింగ్ విధానంపై ప్రవేశపెట్టిన ఓ ప్రైవేట్ సభ్యుడి బిల్లుపై అప్పటి న్యాయశాఖ మంత్రి డివి సదానందగౌడ ప్రసంగిస్తూ సభ్యుడి ఉద్దేశం అభినందించదగిందే కానీ, ఓటును తప్పనిసరి చేస్తూ, ఓటేయని వారికి జరిమానా విధించటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. గత మార్చిలో లా కమిషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ డిమాండ్‌ను ఆమోదించటం ఏ రకంగా చూసినా అప్రజాస్వామికం, చట్ట వ్యతిరేక చర్య అని పేర్కొందని జైదీ సమావేశంలో పేర్కొన్నారు. అయితే దేశంలోని వివిధ చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను న్యాయశాఖకు, పార్లమెంటరీ స్థారుూసంఘానికి తెలిపామని, దీనిపై రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వస్తే రాజ్యాంగ సవరణ చేయవచ్చని ఆయన అన్నారు. అయితే ఇందుకోసం పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఖరీదు చేయాల్సి ఉంటుందని, సుమారు 9వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఆయన అన్నారు.

ఓటరు చైతన్యంపై బుధవారం ఢిల్లీలో మొదలైన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతున్న
ప్రధాన ఎన్నికల కమిషనర్ నాసీం జైదీ