అంతర్జాతీయం

క్రిస్మస్ వేళ..కూలిన ఇళ్ల వద్ద..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, డిసెంబర్ 25: క్రైస్తవుల పవిత్ర పండుగ, ఏసుక్రీస్తు పుట్టిన రోజయిన క్రిస్మస్‌ను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాల్సిన వేళ అనేక మంది ప్రజలు విధ్వంసమయిన తమ ఆస్తులను చూసి గుండెలు పగిలి, ఆ విషాదంతోనే పోగుపడిన చెత్తను తొలగించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో డజనుకుపైగా విరుచుకుపడిన భయంకర తుపానుల బారిన పడిన అమెరికాలోని ఆరు రాష్ట్రాలలో ప్రజలు ఎదుర్కొంటున్న హృదయవిదారక పరిస్థితి ఇది. 14మందిని పొట్టన పెట్టుకున్న ఈ టోర్నడోలు పెద్ద మొత్తంలో ఆస్తులను ధ్వంసం చేశాయి. ఇల్లినాయిస్ నుంచి అలబామా వరకు వీటి బారిన పడ్డాయి. అయితే దక్షిణాన గల మిసిసిపి ఈ టోర్నడోల దెబ్బకు బాగా దెబ్బతిన్నది. ఇక్కడ భయంకర తుపానుల వల్ల ఏడుగురు మృతి చెందారని మిసిసిపి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఎంఇఎంఎ) తెలిపింది. ముఖ్యంగా ఉత్తర మిసిసిపిలో ఈ తుపానులు ఎక్కువ విధ్వంసం సృష్టించాయని పేర్కొంది. టోర్నడోల వల్ల జరిగిన విధ్వంసాన్ని తమ బృందాలు అంచనా వేస్తున్నాయని, ఎంత వ్యాపారం దెబ్బతిన్నదో అంచనా వేస్తున్నాయని, కూలిన ఇళ్లను లెక్కిస్తున్నాయని ఎంఇఎంఎకు చెందిన బ్రెట్ కార్ గురువారం చెప్పారు.