జాతీయ వార్తలు

చిరునామా తెలిస్తే అంతే సంగతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 21: ఇటీవల వెలుగు చూసిన కోట్లాది రూపాయల కాల్‌సెంటర్ కుంభకోణంలో కుంభకోణానికి పాల్పడిన వారు తమ అక్రమ కార్యకలాపాల్లో భాగంగా ఎదుటి వ్యక్తి ఆర్థిక స్తోమతును అంచనా వేయడం కోసం వ్యక్తుల పేర్లు, చిరునామాలను అందించే పేరుమోసిన వ్యక్తుల సెర్చ్ వెబ్‌సైట్లను ఉపయోగించే వారని పోలీసులు వెల్లడించారు. అలా సేకరించిన చిరునామాలతో ఇంటర్నెట్ ఆధారంగా ఏకకాలంలో వందల ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి కాబోయే ‘బాధితుల’ను బెదిరిస్తారని చెప్పారు.
‘కొంతమంది ఈ ఫోన్‌కాల్‌కు భయపడిపోయి తిరిగి కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబరుకు ఫోన్ చేస్తారు. మళ్లీ ఫోన్ రాగానే కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లు కాల్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ ఆధారంగా వ్యక్తుల పేర్లు, చిరునామాలు తదితర వివరాలుండే వెబ్‌సైట్లను వెతికి కాల్ చేసిన అవతలి వ్యక్తి ఆర్థిక స్తోమతులను అంచనా వేస్తారు’ అని ఒక పోలీసు అధికారి పిటిఐకి చెప్పారు. మంచి ఆర్థిక స్తోమతు ఉన్న వారిని ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసిన అనంతరం కాల్‌సెంటర్ ఏజంట్లు వారితో లోతుగా సంభాషిస్తారని, అది చివరికి బాధితుడు చెల్లించే మొత్తానికి బేరం కుదుర్చుకోవడానికి దారి తీస్తుందని ఆ అధికారి చెప్పారు. ఈ కుంభకోణం ప్రధాన కుట్రదారు సాగర్ థక్కర్ అలియాస్ షాగీ, అతని అనుచరులు అహ్మదాబాద్‌నుంచి ఇలాంటి విఓఐపి కాల్స్ చేసే వారని తమ దర్యాప్తులో తేలిందని ఆ అధికారి చెప్పారు.
సాంకేతిక పరిభాషలో ఇలాంటి కాల్స్ చేయడాన్ని ‘బ్లాస్టింగ్’ అని పిలుస్తారు. డైరెక్ట్ ఇన్‌వర్డ్ డయలింగ్ (డిఓడి)తో ఈ ఫోన్‌కాల్స్‌ను చేస్తారని, ఈ డిఓడిద్వారా ఒక సాఫ్ట్‌వేర్‌తో ఏకకాలంలో పదిమంది అమెరికా పౌరులకు ఫోన్‌కాల్స్ చేయవచ్చట. అమెరికా పన్ను అధికారులు చేసినట్లుగా ఫోన్లు అందుకున్న వారు నమ్మే విధంగా అమెరికా పౌరుల ఫోన్ నంబర్లను పోలిన ఫోన్ నంబర్లు కాల్స్ అందుకున్న వారి సెల్‌ఫోన్లలో కనిపిస్తాయి. దీంతో కాల్స్ అందుకున్న అమెరికా పౌరులు భయపడిపోయి తమను అరెస్టు చేయకుండా ఉండడానికి ఆ కాల్స్‌కు సమాధానమిస్తారు. అంతే.. దానితో బేరసారాలు మొదలవుతాయి. ముందుగా నంబరు డయల్ చేసిన వారు కాల్ అందుకున్న వారిని మీరు సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నారా అని అడుగుతారు. అతను అవునని చెప్తే చాలు ఆ కాల్‌ను తనకన్నా సీనియర్‌కు బదిలీ చేస్తారు. ఆ తర్వాత అతను బాధితుడ్ని మాటల్లో పెట్టి ఎంత మొత్తం చెల్లించాలో బేరసారాలు మొదలుపెడ్తాడు. అంతేకాదు అతడ్ని మొబైల్ ఫోన్‌ను స్పీకర్ మోడ్‌లోనే ఉంచి దగ్గర్లో ఉన్న పేరుమోసిన సూపర్‌మార్కెట్ చైన్ వద్దకు వెళ్లమని చెప్తాడని, అక్కడ బేరం సెటిలవుతుందని ఆ అధికారి తెలిపారు.