జాతీయ వార్తలు

ఇక సులువుగా వీసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, అక్టోబర్ 23: దేశంలో పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు, అలాగే వ్యాపార వాణిజ్యాలను పెంపొందించేందుకు వీసా మంజూరు విధానాన్ని మరింతగా సరళతరం చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటామని ఆదివారం నాడిక్కడ ముగిసిన ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. విదేశీయులకు, విదేశాల్లో ఉన్న భారతీయులకు వీసా మంజూరు అన్నది తీవ్ర సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఈ దిశగా ఆలోచిస్తున్నామని ఆమె వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అనేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దాదాపు వంద దేశాలకు పైగా వర్తింపచేసే విధంగా 2014 నవంబర్‌లో ఈ-వీసా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ ఏడాది దీన్ని మరో 32 దేశాలకు విస్తరించామని, ప్రస్తుతం దీని పరిధిలో 150 దేశాలున్నాయని సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచీ దేశంలోకి వచ్చే విదేశీ టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. భారత దేశంలో ఉన్న పర్యాటక, చారిత్రక ప్రదేశాల ప్రాధాన్యతను ప్రచారం చేయడంలో ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు క్రియాశీలకంగా వ్యవహిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సరళతరం చేసిందని, తద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలూ భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా మార్గాలను విస్తరించిందని వెల్లడించారు. అలాగే ఈ రెండున్నర ఏళ్ల కాలంలో భారత విదేశాంగ విధానం కూడా అత్యంత అర్థవంతంగా రూపుదిద్దుకుందని, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలతో భారత్ సన్నిహిత సంబంధాలను పెంచుకునేందుకు దోహదం చేసిందని తెలిపారు. రానున్న కొన్ని నెలల్లోనే ఈ విధానాన్ని మరింత అర్థవంతంగా మారుస్తామని, అన్ని దేశాలతోనూ వ్యాపార వాణిజ్య సంబంధాలను పెంపొందించుకుంటామన్నారు. ప్రస్తుత సమావేశంలో పాల్గొన్న అన్ని దేశాలతోనూ భారత్‌కు బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు.