జాతీయ వార్తలు

రాహుల్‌కు పార్టీ పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే పార్టీ అధ్యక్ష పదవి చేపడతారని పార్టీ సీనియర్ నాయకురాలు అంబికా సోని ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. రాహుల్ గాంధీ త్వరలోనే సోనియా గాంధీ స్థానంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు, అయితే అధ్యక్ష పదవిని కచ్చితంగా ఎప్పుడు చేపడతారనేది వెల్లడించలేనని అంబికా సోని తెలిపారు. రాహుల్ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు. అంబికా సోని కూడా ఆయన వెంట పాల్గొంటున్నారు. రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టటం గురించి ఏడాది నుండి రకరకాల కథనాలు రావటం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడతారని గత వారం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అతిత్వరలోనే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడతారంటూ పంజాబ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది.