జాతీయ వార్తలు

సైనిక లాంఛనాలతో సుశీల్ అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుక్షేత్ర, అక్టోబర్ 25: పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద అసువులు బాసిన బిఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో సైనిక లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. సుశీల్‌కు నివాళులర్పించేందుకు ఆయన స్వగ్రామమైన పిహోవా స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్థానికులతో పాటు సమీప గ్రామాలనుంచి భారీ సంఖ్యలో పిహోవా చౌక్‌కు తరలివచ్చారు. అక్కడినుంచి సాగిన అంతిమయాత్ర గుల్హా రోడ్‌లోని సుశీల్ నివాసం వరకు కొనసాగింది. అంతిమయాత్రలో బిఎస్‌ఎఫ్ ఉన్నత స్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు. సుశీల్ భౌతిక కాయాన్ని కొద్దిసేపు ఆయన నివాసం వద్ద ఉంచిన అనంతరం శ్మశానానికి తరలించారు. పూర్తిస్థాయి సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. భారీ సంఖ్యలో హాజరైన బంధువులు, స్థానికులు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు, హర్యానా ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమ మంత్రి క్రిషన్ బేడీ హాజరై సుశీల్‌కు నివాళులర్పించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను సుశీల్ కుటుంబ సభ్యులకు అందజేస్తామని ఆయన ప్రకటించారు.