అంతర్జాతీయం

బంకర్లే వారికి నివాసాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్దుల్లియాన్ (అంతర్జాతీయ సరిహద్దు), అక్టోబర్ 25: అంతర్జాతీయ సరిహద్దు పొడవునా పాకిస్తాన్ రేంజర్లు పాల్పడుతున్న కాల్పుల ఒప్పందం ఉల్లంఘనలతో ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం నిర్మించిన భూగర్భ కమ్యూనిటీ బంకర్లే రెండో ఇల్లుగా మారాయి. అంతర్జాతీయ సరిహద్దుకు కూతవేటు దూరంలో ఉన్న అబ్దుల్లియాన్ గ్రామంలో అరవై ఏళ్ల నగర్‌సింగ్ తన జీవితకాలమంతా కూడబెట్టిన డబ్బులతో ఇటీవలే సొంత ఇల్లు కట్టుకున్నాడు. అయితే తన కుటుంబం సొంత ఇంట్లోకన్నా ఎక్కువ సమయం బంకర్‌లోనే గడిపిందని అతను వాపోతున్నాడు. పాక్‌వైపునుంచి ఎప్పుడు కాల్పులు జరిగినా సరిహద్దు గ్రామాల్లోని నగర్ సింగ్‌లాంటి వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారనడానికి అతని ఇంటి గోడలపై ఉన్న బులెట్ గుర్తులు, పడిన రంధ్రాలే నిదర్శనం. ‘మా ఇళ్లపై బాంబులు, తూటాల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ వైపునుంచి వచ్చిపడే బాంబుల కారణంగా చాలా ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమైనాయి. మేము ప్రాణాలతో జీవించి ఉన్నామంటే ఈ సరిహద్దు బంకర్ల పుణ్యమే’నని ఇటీవలి కాలంలో పాక్ కాల్పుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కొరోటనా ఖుర్ద్ గ్రామానికి చెందిన షంషేర్ సింగ్ చిబ్ వాపోయాడు. ప్రభుత్వం జమ్మూ జిల్లాలో 43 కమ్యూనిటీ బంకర్లను నిర్మించగా, మరో 47 నిర్మాణంలో ఉన్నాయి. ఒక్క ఆర్‌ఎస్ పుర సెక్టార్‌లోనే ఇలాంటి బంకర్లు 30 ఉన్నాయని జమ్మూ, డిప్యూటీ కమిషనర్ సిమ్రన్‌దీప్ సింగ్ చెప్పారు. ఒక్కో బంకర్‌లో 20 మంది దాకా తలదాచుకోవచ్చు. సరిహద్దుల్లో భారీ ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నప్పుడల్లా అమాయక ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఈ బంకర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సరిహద్దు గ్రామాల్లో కమ్యూనిటీ బంకర్లను నిర్మించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకుంది. రాత్రంతా కుటుంబ సభ్యులతో బంకర్లో గడిపిన తర్వాత తెల్లారి ఆడుకోవడానికి బైటికి వచ్చిన బిహార్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు విక్కీ ఇటీవల పాక్ శతఘ్ని గోళం తాకి చనిపోయాడని డిప్యూటీ కమిషనర్ చెప్పారు. రాష్ట్రంలోని 448 సరిహద్దు ప్రాంతాల్లో వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో 20 వేలకుపైగా బంకర్లను నిర్మించాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కేంద్రానికి పంపించింది. కతువా, సాంబా, జమ్మూ, రాజౌరి, పూంఛ్ సరిహద్దు జిల్లాల్లోని 4 లక్షలకు పైగా ప్రజలకు ఆశ్రయం కల్పించడానికి ఈ బంకర్ల వల్ల వీలవుతుందని, 2015 ఫిబ్రవరి 23న ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలనకోసం పంపించినట్లు అప్పటి ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్ అసెంబ్లీలో చెప్పారు. తామింకా ప్రాణాలతో జీవించి ఉన్నామంటే ఈ బంకర్ల పుణ్యమేనని సరిహద్దు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో అంటున్నారు.

పాక్ సరిహద్దులోని అబ్దుల్లియాన్ గ్రామంలో సైనికులు ఏర్పాటు చేసిన
బంకర్లలో తలదాచుకుంటున్న గ్రామస్థులు