జాతీయ వార్తలు

కలిసే ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 25: సమాజ్‌వాదీ పార్టీలో కానీ, తమ కుటుంబంలో కానీ ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మంగళవారం స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా తన కుమారుడు అఖిలేష్ వర్గానికి, తమ్ముడు శివపాల్ యాదవ్ వర్గానికి మధ్య తీవ్రస్థాయిలో తలెత్తిన విభేదాలు పార్టీని నిలువునా చీల్చేస్థాయికి చేరటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ములాయం స్వయంగా రంగంలోకి దిగారు. తాను లేని సమయంలో ముఖ్యమంత్రి అఖిలేష్‌పై కుట్ర జరిగిందని, 2012లో అతనివల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని ములాయం అన్నారు. మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించటం లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘‘నా రాజకీయ జీవితం అంతా ప్రజల సంక్షేమానికే అంకితమైంది. అఖిలేష్ ప్రజల కోసం పనిచేయటాన్ని కొనసాగిస్తాడు’’ అని అన్నారు. విభేదాలకు అమర్‌సింగే కారణమన్న ఆరోపణలను ములాయం కొట్టిపారేశారు. ఇందులోకి అతణ్ణి ఎందుకు లాగుతారంటూ ప్రశ్నించారు. ‘‘నా కుటుంబం, పార్టీ ఐక్యంగా ఉంది. కార్యకర్తలంతా ఐక్యంగా ఉన్నారు. అయితే ప్రజాదరణ లేని కొందరు కుట్రదారులు పార్టీలో ఉన్నారు’’ అని ములాయం అన్నారు. ఎలాంటి విభేదాలు లేకపోతే శివపాల్‌తోపాటు మరి కొందరు మంత్రులను ఎందుకు తొలగించారన్న విలేఖరుల ప్రశ్నకు ములాయం జవాబిస్తూ ‘‘ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రికే వదిలేస్తున్నా. వాళ్లను ఎందుకు కేబినెట్‌లోకి తీసుకున్నారు? ఎందుకు తొలగించారో ఆయనే్న అడగండి’’ అని ఆయన అన్నారు. తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయదలచుకోలేదని ఆయన అన్నారు. అఖిలేష్ చేతుల్లోంచి తాను అధికారాలు తీసుకుంటారా అన్న ప్రశ్నకూ రెండు నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో తానెందుకిలా ఆలోచిస్తానని ఆయన అన్నారు. తమ పార్టీ ప్రజాస్వామిక పార్టీ అని, ముందుగా 2017 ఎన్నికల్లో మెజారీటీ వచ్చిన తరువాత అప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని, ప్రస్తుతానికి అఖిలేషే సిఎం అని ఆయన అన్నారు.
అఖిలేష్ మంచి సిఎం: అమర్‌సింగ్
కోల్‌కతా: ఉత్తరప్రదేశ్‌కు అఖిలేష్ గొప్ప ముఖ్యమంత్రి అని, అయితే ఆయన ప్రజానేత కావటానికి ఇంకా సమయం పడుతుందని సమాజ్‌వాది సీనియర్ నేత అమర్‌సింగ్ అన్నారు. ‘‘ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు అద్భుతం. అభివృద్ధి, అందుకు సంబంధించిన అజెండా అమలు చేయటంలో ఆయన చక్కగా పనిచేశారు. ఆయన ప్రజానేత కారని నేనటం లేదు కానీ, అందుకు కొంత సమయం పడుతుంది. అతను ఇంకా యువకుడు. ములాయంసింగ్ యాదవ్‌కు ఉన్న అనుభవం, సంస్థాగత నైపుణ్యం, అఖిలేష్ యువ నాయకత్వం రెండూ చాలా అవసరం’’ అని అమర్‌సింగ్ అన్నారు.
అది వారి అంతర్గత వ్యవహారం
న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీలో విభేదాలు వారి అంతర్గత వ్యవహారమని, వంశపారంపర్య రాజకీయాలే యూపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలకు కారణమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

లక్నోలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతున్న ములాయం సింగ్ యాదవ్