జాతీయ వార్తలు

మోదీని రాహుల్ ప్రశ్నించడమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: అవినీతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించటం ‘ఈ సంవత్సరం పెద్ద జోక్’ అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. వెంకయ్య శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ పీకల వరకు అవినీతి ఆరోపణలతో మునిగితేలిన యుపిఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీని అవినీతి విషయంలో ప్రశ్నించటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రులు అవినీతి ఆరోపణలతో కోర్టు కేసులను ఎదుర్కొంటున్న విషయం రాహుల్ గాంధీకి తెలియదా? అని వెంకయ్య ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధానిని ప్రశ్నించటం హాస్యాస్పదమన్నారు. పదవి కోసం ఆఖరుకు న్యాయ వ్యవస్థ ద్వారా శిక్ష పొందిన నాయకుడి పార్టీతో చేతులు కలిపి కొన్ని సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నాయకుడు ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉన్నదని వెంకయ్య చురక వేశారు. అధికారం కోసం అన్ని విలువలను గాలికి వదిలేసిన రాహుల్ గాంధీకి బిజెపిని, నరేంద్ర మోదీని ప్రశ్నించే హక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రధాన మంత్రి అవినీతిని సహించడు, అవినీతిపరులను ఆమడదూరంగా ఉంచుతారనేది అందరికి తెలిసిందేనని వెంకయ్య చెప్పారు. కేంద్రంలో ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ మంత్రిపై కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని, కాంగ్రెస్ నాయకులు తాజాగా లేవనెత్తిన ఢిల్లీ క్రికెట్ సంఘం అవినీతి వ్యవహారం ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగింది కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ అవకతవకలపై ఇప్పుడు ప్రశ్నించటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్‌డిఏ ప్రభుత్వంలో అత్యంత సమర్థుడు, నీతివంతుడు, ప్రజా జీవనంలో ఉన్నత ప్రమాణాలతో ఆదర్శాలను నెలకొల్పిన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై ఆరోపణలు చేయటం, రాజీనామా కోరటం విడ్డూరంగా ఉందన్నారు. తాజాగా తమతో చేరిన ఆమ్‌ఆద్మీ పార్టీతో కలిసి జైట్లీపై ఆరోపణలు చేయటం వారికే తిప్పికొడుతుందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి గురించి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొని ప్రస్తావించటం, ప్రధాని సమాధానం చెప్పాలనటం కాంగ్రెస్ అవివేకానికి నిదర్శనమని వెంకయ్య దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేయటం పట్ల దేశ ప్రజల్లో ఆగ్రహం ఉన్నదని అభిప్రాయపడ్డారు. పార్లమెంటును ఎందుకు జరగనివ్వలేదనేది కాంగ్రెస్ ఇంతవరకు స్పష్టం చేయలేకపోయిందని వ్యా ఖ్యానించారు. జువనైల్ బిల్లును కాంగ్రెస్ మొదట్లో వ్యతిరేకించినా దేశవ్యాప్తంగా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహాన్ని చూసి బిల్లును సమర్థించిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాజకీయం మోదీ ముందు పని చేయదని వెంకయ్య స్పష్టం చేశారు.