జాతీయ వార్తలు

ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు ఫైళ్లు సమర్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రధాని విదేశీ పర్యటనలకు సంబంధించిన ఫైళ్లను తనకు అందజేయాలని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది. ధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల కారణంగా అయిన ఖర్చులను అంచనా వేయడం కోసం లోకేష్ బాత్రా అనే ఆర్‌టిఐ కార్యకర్త ఇంతకు ముందు ఆ డాక్యుమెంట్లను చూడడానికి అవకాశమివ్వాలని విదేశాంగ శాఖను కోరారు. అయితే సెక్యూరిటీ, వ్యక్తిగత భద్రతకు సంబంధించి సమాచార హక్కు చట్టంలోని నిబంధనలను సాకుగా చూపిస్తూ ఈ వివరాలు చూపడానికి విదేశాంగ శాఖ నిరాకరించింది. అయితే ఫైళ్లను పరిశీలించకుండా కోరిన ఫైళ్లలో భద్రతాపరమైన సమాచారం ఏదయినా ఉందా అనే విషయాన్ని నిర్ధారించ లేమని, అందువల్ల ముందుగా ఒక ఫైల్‌ను తనముందు సమర్పించాలని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాధాకృష్ణ మాధుర్ విదేశాంగ శాఖను ఆదేశించారు. ఈ కేసులో ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశం బోలెడంత ఉందని, ఎయిర్ ఇండియాకు చెల్లించిన మొత్తం వేల కోట్ల రూపాయలున్నట్లు చెబుతున్నారని, ఆ సొమ్మంతా కూడా పన్ను చెల్లింపుదారులదేనని బాత్రా కమిషన్ ముందు వాదించారు. ప్రస్తుత ప్రధాని, మాజీ ప్రధానుల విదేశీ పర్యటనలకు అయిన ఖర్చుల వివరాలకు సంబంధించి నాలుగు అంశాలపైన తాను ఈ సమాచారాన్ని కోరుతున్నట్లు బాత్రా తెలిపారు. అయితే 2014 జూన్ 15నుంచి 2016 సెప్టెంబర్ 8 మధ్య కాలంలో ప్రధాని జరిపిన ప్రయాణాలకు సంబంధించిన బిల్లులు చెల్లింపులకోసం ప్రాసెస్‌లో ఉన్నాయని, లేదా ఇంకా అందలేదని సెప్టెంబర్ 13 నాటి పిఎంఓ వెబ్‌సైట్ చెబుతోందని బాత్రా కమిషన్‌కు తెలిపారు.
కాగా, సమాచార హక్కు చట్టంలోని 8(1)(జి) సెక్షన్ కింద ప్రధాని విమాన ప్రయాణాలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడానికి వీల్లేదని, అందువల్ల ఈ ఫైళ్లను పరిశీలించడానికి అనుమతించలేమని విదేశాంగ శాఖ బాత్రా దరఖాస్తుకు సమాధానంగా తెలియజేసింది.