జాతీయ వార్తలు

16న బ్లూప్రింట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకం బ్లూప్రింట్‌ను 16న ప్రకటించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలోని అన్ని ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్ర వర్శిటీలు, ఎన్‌ఐటిల ద్వారా యువతను కార్యక్రమంతో అనుసంధానిస్తామని అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం గినె్నస్ బుక్‌కు ఎక్కిందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం ఆకాశవాణిలో 15వసారి మనసులో మాట కార్యక్రమంలో మాట్లాడారు. కోట్లాది లబ్దిదారుల ఖాతాల్లోకి వివిధ పథకాల కింద దాదాపు 40వేల కోట్లు నేరుగా చేరిందన్నారు. ఈ విజయం స్ఫూర్తితో నగదు బదిలీలోకి మరో 30 నుంచి 40 పథకాలు చేర్చే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. 2015 నవంబర్ చివరినాటికి 15 కోట్లమంది ఎల్పీజీ వినియోగదారులు ప్రత్యక్ష నగదు బదిలీలో చేరారు. వీరి ఎల్పీజీ రాయితీ నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి పోతోందని మోదీ ప్రకటించారు. నగదు బదిలీ మూలంగా మధ్యవర్తులు, బ్రోకర్లకు స్థానం లేకుండాపోవటంతోపాటు అక్రమాలకు పూర్తిగా తాళం పడిందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి కల్పనా పథకం నిధులు కూడా నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి వెళ్తున్నాయి. దీంతో మధ్యవర్తులను పూర్తిగా తొలగించటం సాధ్యమైందన్నారు.
వికలాంగులను ఇకమీదట దివ్యాంగులుగా సంబోధించాలని మోదీ ప్రతిపాదించారు. అంగవైకల్యం ఉన్నవారిని పలు రకాలుగా పిలుస్తున్నాం. అయితే ప్రతిదానిలో ఏదోక లోపం కనిపించింది కాబట్టి, ఇకమీదట దివ్యాంగులుగా పిలుద్దామని మోదీ దేశ ప్రజలకు సూచించారు. వైకల్యం లేనివాళ్లకంటే కొన్ని పనులు సమర్థం చేస్తున్నారంటే, వాళ్లలో దివ్యశక్తి ఉన్నట్టే కదా. అందుకే అలా సంబోధిద్దాం అని పిలుపునిచ్చారు. ప్రజలు హక్కులతోపాటు రాజ్యాంగంలో పొందుపర్చిన బాధ్యతల గురించీ ఆలోచించాలన్నారు. దేశంలో ఏర్పాటు చేసుకున్న ప్రఖ్యాత పురుషుల విగ్రహాలను ప్రజలు శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ యువత దినోత్సవంగా నిర్వహించుకునే స్వామి వివేకానంద జన్మదినం గురించి మాట్లాడుతూ యువదినోత్సవం నిర్వహణకు సూచనలు పంపాలని కోరారు. ప్రధాని దేశ ప్రజలకు కిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

చిత్రం..

రేడియోలో మోదీ ప్రసంగం వింటున్న పిల్లలు