జాతీయ వార్తలు

మరో ‘ముంబయ’ లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: గూఢచర్యం చేస్తూ పట్టుబడిన పాకిస్తాన్ హైకమిషన్ అధికారి మెహమూద్ అక్తర్ పశ్చిమ తీరంలో భారత భద్రతా బలగాల మోహరింపునకు సంబంధించిన రహస్య సమాచారంతో పాటు ముంబయి దాడుల మాదిరిగా భారత్‌లో మరోసారి ఉగ్రవాద దాడి నిర్వహించేందుకు గల అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించాడని, ప్రత్యేకించి పశ్చిమ తీరంతో పాటు సర్‌క్రీక్, కచ్ ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపునకు సంబంధించిన సమాచారాన్ని, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల్లో సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించాడని కేంద్ర హోం శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ముంబయి దాడుల మాదిరిగా భారత్‌లో మరోసారి ఉగ్రదాడి నిర్వహించేందుకు సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులను పంపాలని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) వ్యూహరచన చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయని ఆ అధికారి తెలిపారు. భారత్‌లో అక్తర్ సాగిస్తున్న కార్యకలాపాలు, పశ్చిమ తీరంలో భద్రతా బలగాల మోహరింపునకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు అతను చేస్తున్న ప్రయత్నాల గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు గతంలోనే ఉప్పందించాయని ఆ అధికారి వివరించారు. సర్‌క్రీక్, కచ్ ప్రాంతాల్లో భద్రతా బలగాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని వౌలానా రంజాన్, సుభాష్ జాంగిర్ అనే వ్యక్తులు అక్తర్‌కు చేరవేస్తున్నారని, వీరిద్దరనీ గురువారం అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమాచారాన్ని అందించిన రంజాన్, జాంగిర్‌లకు అక్తర్ 50 వేల రూపాయలను ముట్టజెప్పాల్సి ఉందని, పోలీసుల ఎదుట అక్తర్ ఈ విషయాలన్నింటినీ ఒప్పుకున్నాడని ఆ అధికారి తెలిపారు. 2008 నవంబర్‌లో కరాచీ నుంచి అరేబియా సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి చొరబడిన 10 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబయిలో మూడు రోజుల పాటు మారణహోమం సృష్టించి 166 మంది ప్రాణాలను బలితీసుకున్న విషయం విదితమే.
గూఢచర్యం కేసులోఅరెస్టయన
పాస్‌పోర్ట్ వీసా ఏజెంట్ షోయబ్