జాతీయ వార్తలు

గనుల వేలానికి సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: గనుల వేలానికి సిద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సూచించింది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 31 గనుల వేలానికి కేంద్రం సమాయత్తమైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిషా, మధ్యప్రదేశ్‌లలో గనుల వేలం ప్రక్రియ ఇంకా ఊపందుకోకపోవడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నెల ఆరంభంలో రాష్ట్ర ప్రభుత్వాలతో జరిగిన సమన్వయ, సాధికారిక కమిటీ (సిసిఇసి) సమావేశంలో కేంద్రం తమ ఆందోళనను కూడా తెలియజేసింది. ఈ క్రమంలో వేలం ప్రక్రియను వేగిరం చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం మళ్లీ తెలిపింది.