జాతీయ వార్తలు

ప్రభుత్వమే అతిపెద్ద కక్షిదారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారత న్యాయస్థానాల్లో ప్రభుత్వమే అతిపెద్ద కక్షిదారుగా ఉందని, కోర్టులపై ఆ భారాన్ని తక్షణం తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యాయవ్యవస్థ విచారించే కేసుల్లో ప్రభుత్వమే ఒక పార్టీగా ఉన్నవే అధికంగా ఉన్నాయని మోదీ అన్నారు. ఢిల్లీ హైకోర్టు స్వర్ణోత్సవాలలో భాగంగా ఆయన సోమవారం మాట్లాడారు. ‘కోర్టులు ఎక్కువ సమయం మాపైనే వెచ్చిస్తున్నాయి. మేమంటే మోదీ కాదు.. ప్రభుత్వం. ఒక కేసు పరిష్కారమైనప్పుడు.. అదేతరహా కేసులకు ఆ తీర్పు దిక్సూచిలా ఉండేలా చూడగలిగితే కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. సర్వీస్ వ్యవహారాలకు సంబంధించిన ఓ కేసును ఒక టీచర్ నెగ్గినప్పుడు.. ఆ తరువాత అదేతరహాలో ఉత్పన్నమయ్యే కేసులకు ఇదొక మార్గదర్శకం కావాలి. సరైన సంఖ్య తెలియకపోయినప్పటికీ, కనీసం 46శాతం కేసులు ప్రభుత్వం పార్టీగా విచారణలో ఉన్నాయి. సర్వీస్ అంశాల నుంచి పరోక్ష పన్నుల దాకా వేర్వేరు స్థాయిల్లో కేసులు ఉన్నాయి’ అని మోదీ అన్నారు. లిటిగేషన్ విధానానికి తుదిరూపునివ్వటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. న్యాయశాఖ 2010లో రూపొందించిన ముసాయిదా ప్రకారం అనేక రాష్ట్రాలు వారి వారి విధానాలతో ముందుకు వెళ్లాయని మోదీ వివరించారు. లిటిగేషన్ విధానాన్ని తాజా పరిస్థితులకు అనుగుణంగా రూపొందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి విషయంలోనూ తుది నిర్ణయాన్ని కోర్టులకే వదిలేయాలన్న మైండ్‌సెట్ మార్చుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. అఖిల భారత పౌర సేవల సర్వీసు (ఐఏఎస్)ను ప్రారంభించిన సర్దార్ పటేల్ జయంతి సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. విధానాల అమలులో అధికారులు కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాలన్నారు. అఖిలభారత న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయంపై వివాదాస్పదమైనా చర్చ జరగాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చ అనేది అవసరమని ఆయన స్పష్టం చేశారు.
రుజువర్తనపై రాజీ కూడదు: ఠాకూర్
ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయపరమైన నైతిక వర్తన విషయంలో రాజీపడకూడదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఉద్ఘాటించారు. ఈ విషయంలో చోటుచేసుకున్న అపశ్రుతులు మొత్తం న్యాయవ్యవస్థపైనే ప్రతికూల ప్రభావాన్ని కనబరుస్తాయని అన్నారు. తమ నీతి నిజాయితీలు, రుజువర్తన విషయంలో ప్రజలు ఏమనుకుంటారో అన్న భావనను నిరంతరం మనసులో పెట్టుకోవాలని, ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా న్యాయమూర్తులను కోరారు. ఏదో ఒక దశలో చోటుచేసుకునే అపశ్రుతుల వల్ల న్యాయవ్యవస్థపైనే అపవాదం పడుతోందని ఢిల్లీ హైకోర్టు 50 వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో చీఫ్ జస్టిస్ అన్నారు.
ఈ రకమైన అపశ్రుతులకు ఆస్కారం లేకుండా చేయాలంటే ఇంకా ఎంతగానో కృషి చేయాల్సి ఉంటుందని ఉద్ఘాటించారు. అన్ని స్థాయిల్లో పనిచేసే సోదర న్యాయమూర్తులు న్యాయవర్తనకు సంబంధించి ఏ రకమైన అనుమానాలకు, అపవాదులకు ఆస్కారం లేని రీతిలో వ్యవహరించాలని కోరుతున్నానని అన్నారు. న్యాయపరమైన నీతి నియమాలు, వ్యక్తిగత రుజువర్తన, నిజాయితీలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని తెలిపారు.