జాతీయ వార్తలు

అన్ని సమస్యలకు అభివృద్ధే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపూర్, నవంబర్ 1: దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు అభివృద్ధి ఒక్కటే పరిష్కారమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశాన్ని పేదరిక రహితంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కలిసి పనిచేయాలని కోరారు. యువకులు నైపుణ్యం సాధిస్తే పేదరికంనుంచి బైటపడడమే కాకుండా దేశ అభివృద్ధికి సైతం దోహపడగలరని అన్నారు. ఎకో టూరిజంకు ఎక్కువ అవకాశాలున్న చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు ఆ రంగం అభివృద్ధికి కొద్దిపాటి నిధులు పెట్టుబడి పెట్టడం ద్వారా భారీఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించగలవని అన్నారు. మంగళవారం నయా రాయపూర్‌లో చత్తీస్‌గఢ్ 16వ రాజ్యోత్సవ వేడుకలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ప్రధాని అన్నారు. పేదరికాన్ని పారద్రోలడానికి కేంద్రం, రాష్ట్రాలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు భుజం భుజం కలిపి పని చేయాలని అన్నారు. పేదల సముద్ధరణ కోసం కేంద్రం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి సంవత్సరమైన 2016ను ‘గరీబ్ కళ్యాణ్ వర్ష్’గా పాటిస్తోందని మోదీ చెప్పారు.
నైపుణ్యాన్ని సముపార్జించుకోవడాన్ని తన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంతో ఆయన పోలుస్తూ నైపుణ్యం కలిగిన వ్యక్తులు దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడానికి దోహదపడగలరన్నారు. తమ ప్రభుత్వం ప్రయత్నమంతా కూడా పేదల సముద్ధరణకోసమేనని అన్నారు. రాష్ట్రంలో తాను ఈ రోజు ప్రారంభించిన జంగిల్ సఫారీ ఆలోచనను ప్రధాని ప్రశంసిస్తూ, ఎకో టూరిజం ద్వారా రాష్ట్రాలు పెద్ద సంఖ్యలో జనానికి ఉపాధి అవకాశాలను సృష్టించగలవన్నారు. ఎకో టూరిజం వల్ల నేరుగా లబ్ధి పొందే వారికన్నా కూడా ఆటో రిక్షా డ్రైవర్లు, పండ్ల వ్యాపారులు, చాయ్‌వాలాలులాంటి వారు పరోక్షంగా లబ్ధి పొందగలరని అన్నారు. ఒక పారిశ్రామిక యూనిట్‌ను ఏర్పాటు చేయడానికన్నా చాలా తక్కువ పెట్టుబడి అవసరమయ్యే జంగిల్ సఫారీ లాంటి ఆలోచనలు చత్తీస్‌గఢ్‌లాంటి చిన్న రాష్ట్రాలకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టగలవన్నారు. కేంద్రం కొత్తగా ప్రారంభించిన పంటల బీమా పథకాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, వ్యవసాయాన్ని మరింత లాభదాయకం చేయాల్సిన అవసరం ఎంతయనా ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై మాట్లాడుతూ, కొత్త పథకాలను అమలు చేయడానికి రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడే విధంగా ఉండే సహకార ఫెడరలిజాన్ని తమ ప్రభుత్వం నమ్ముతుందని చెప్పారు. అభివృద్ధికి నిధులను కేటాయించే విషయంలో కేంద్రం రాష్ట్రాల పట్ల ఎలాంటి వివక్షా చూపించదని చెప్పారు.
chitram...
నయా రాయపూర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీతో సెల్ఫీ తీసుకుంటున్న చిన్నారి దేవాన్షి. స్థానికంగా నిర్వహించిన చెస్ టోర్నమెంట్‌లో దేవాన్షి చాంపియన్‌గా నిలిచింది.