జాతీయ వార్తలు

నవాజ్ అవినీతిపై జుడీషియల్ కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 1: పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి, ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పనామా పత్రాల్లో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కొంతకాలంగా ప్రధాని షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవి నుంచి రాజీనామా చేయాలని నవాజ్ షరీఫ్‌పై తీవ్రస్థాయిలోనే ఒత్తిడి తెచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో తాను తలపెట్టిన ఇస్లామాబాద్ దిగ్బంధ ర్యాలీని ఇమ్రాన్‌ఖాన్ వాయిదా వేసుకున్నారు. నవాజ్ అవినీతిపై సుప్రీం నిర్ణయాన్ని హర్షిస్తున్నామని తన ప్రతిపాదిత ర్యాలీని ఓ ఉత్సవంగా మార్చుకుంటామని మంగళవారం ఇక్కడ ప్రకటించారు. ఇతర దేశాల్లో నవాజ్ షరీఫ్ ఆయన కుటుంబ సభ్యులకు భారీగా ఆస్తులు ఉన్నాయంటూ పనామా పత్రాలు వెల్లడించిన నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సుప్రీం కోర్టుకు ఉన్న అధికారాలతో జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన న్యాయమూర్తి అన్వర్ జహీర్ జమాలీ తెలిపారు.

ఇస్లామాబాద్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్