జాతీయ వార్తలు

ఎంపీల జీతాలు రెండింతలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: పార్లమెంట్ సభ్యుల జీతాలు ఇప్పుడున్న వాటికంటే రెట్టింపు కాబోతున్నాయి. నూటికి నూరు శాతం ఎంపీల జీతాలు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ప్రస్తుతం వారికి లభిస్తున్న మూల వేతనం 50వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెరుగుతుంది. బిజెపి ఎంపీ యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని సంయుక్త కమిటీ ఈ మేరకు చేసిన సిఫార్సులను పరిశీలించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) అంగీకరించినట్టు తెలుస్తోంది. కేవలం ఎంపీల జీతాలనే కాకుండా వారికిచ్చే అలవెన్స్‌లను కూడా పెంచే అంశాన్ని పిఎంఓ పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్టప్రతి జీతాన్ని లక్షన్నర నుంచి ఐదు లక్షలకు, గవర్నర్ల జీతాలను లక్షా పదివేల నుంచి రెండు లక్షల 25వేల వరకూ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.