జాతీయ వార్తలు

ఇంకా ఏంచేద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: పాకిస్తాన్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టానుసారం జరుపుతున్న మోర్టారు దాడుల మూలంగా సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. సమీక్షా సమావేశంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. పాకిస్తాన్ సైన్యం పదిహేను రోజులుగా జరుపుతున్న కాల్పులను తిప్పికొట్టేందుకు మన సైన్యం, సరిహద్దు భద్రతా దళం నిర్వహిస్తున్న ప్రతి దాడులు, ఇతర అంశాలపై లోతుగా చర్చించారు. పాకిస్తాన్ రేంజర్లు మన దేశంలోని పౌర ప్రాంతాలపై మర తుపాకులతోపాటు 80 ఎంఎం, 120 ఎంఎం మోట్టార్లతో బాంబుల వర్షం కురిపించటం గురించి ప్రధానంగా చర్చించారు.
సరిహద్దు భద్రతా దళాల ప్రతిదాడుల్లో గత రెండు రోజుల్లో పాకిస్తాన్‌కు చెందిన పదిహేను బంకర్లను ధ్వంసం చేయటం తెలిసిందే. పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరుపుతూ ఇస్లామిక్ ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు సరిహద్దు భద్రతా దళాలు తీసుకుంటున్న చర్యలు సరిపోతాయా? లేదా? అనే అంశంపైనా చర్చించినట్టు చెబుతున్నారు. పాకిస్తాన్ రేంజర్లు జరిపే దాడులకు ధీటుగా ప్రతిదాడులు జరిపే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం బిఎస్‌ఎఫ్, సైన్యానికి ఇవ్వటం తెలిసిందే. దాడులను కేవలం తిప్పికొట్టటమే కాదు, గట్టిగా బుద్ది చెప్పాలని ఎన్‌డిఏ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇంత జరుగుతున్నా పాక్ రేంజర్లలో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యంపై వత్తిడి పెంచేందుకు మరికొన్ని మెరుపు దాడులు చేస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఒక లక్ష్యంతో పౌర ప్రాంతాలపై బాంబులు కురిపిస్తోంది కాబట్టి దీన్ని తిప్పికొట్టేందుకు ఆక్రమిత కాశ్మీర్‌లోని పాకిస్తాన్ సైన్యానికి చెందిన ముఖ్యమైన కేంద్రాలను ధ్వంసం చేయటంద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని ఎన్‌డిఏ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రతిదాడుల స్థాయి ఏమాత్రం తగ్గినా పాకిస్తాన్ సైన్యం మరింత రెచ్చిపోతుంది కాబట్టి రేంజర్లు ఒక తూటా పేలిస్తే మన సైన్యం ప్రతిగా వంద తూటాలు కాల్చే విధానాన్ని అనుసరించాలని ఎన్‌డిఏ ప్రభుత్వం మన సైన్యాన్ని ఆందేశించినట్టు తెలిసింది. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఇలాగే ఉల్లంఘించే పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకునేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోందని అంటున్నారు.