జాతీయ వార్తలు

ధైర్యానికి ఆమే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 2: పధ్నాలుగేళ్ల క్రితం ఆమెను అమానుషంగా సామూహిక అత్యాచారం చేశారు. నగ్నంగా ఊళ్లో ఊరేగించారు. కానీ, అందరు ఆడపిల్లల్లా జీవితానికి, సమాజానికి భయపడి ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. మొక్కవోని ధైర్యంతో నిలిచి పోరాడింది. ఇనే్నళ్ల తరువాత కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో రాంప్‌వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. ఆమె నిబ్బరానికి పాకిస్తానీ మోడలింగ్ ప్రపంచం రెడ్‌కార్పెట్ పరచి స్వాగతం పలికింది. పాకిస్తాన్‌లో ఆమెలా ఉన్న లక్షలాది మహిళా బాధితులకు ఆదర్శంగా నిలిచింది. ‘‘నేను వేసిన ముందడుగు ఒక్క మహిళకు సహాయపడినా నేను ఎంతో సంతోషిస్తాను’’ అని ఆమె అంటోంది. 2002లో ముఖ్తార్ మాయ్ అనే ఈ యువతి సోదరుడు ప్రత్యర్థి కుటుంబాన్ని పరాభవించాడని, అక్కడి గిరిజన పెద్దలు అమానవీయ, అనాగరిక తీర్పు చెప్పారు. ప్రత్యర్థి కుటుంబాన్ని సోదరుడు పరాభవించాడు కాబట్టి, అతని సోదరి అయిన ముఖ్తార్‌ను సామూహిక అత్యాచారం చేసి, పరాభవించాలని తీర్పు చెప్పారు. ఈ వ్యవహారంపై ముఖ్తార్ పాకిస్తాన్ సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోరాటం చేసింది. ఆమెపై లైంగిక దాడి చేసిన 14మందిని జైలు పాలు చేసింది. అందులో ఆరుగురికి మరణ దండన కూడా పడింది. అయితే వారంతా ఆ తరువాత అప్పీల్ చేసుకుని బెయిలుపై విడుదలయ్యారు. అంతేకాదు.. ఆమె మహిళా హక్కులకోసం ఒక చారిటీని ఏర్పాటు చేసింది. తన గ్రామం మీర్‌వాలాలో బాలికలకోసం పాఠశాల కూడా నడిపిస్తోంది. మంగళవారం రాత్రి పాకిస్తాన్‌కు చెందిన గొప్ప మోడల్స్, డిజైనర్లు వెంటరాగా ముఖ్తార్ కొద్దిగా సిగ్గుపడుతూ, ఎంబ్రాయిడరీ పెళ్లికూతురు షర్ట్, సిల్వర్ సిల్క్ పైజామా, స్కార్ఫ్‌తో ర్యాంప్‌వాక్ చేసింది. ఏదైనా ఒక ప్రమాదం సంభవించినంత మాత్రాన అదే జీవితానికి ముగింపు కారాదన్న సందేశాన్ని ముఖ్తార్ ఇచ్చిందని డిజైనర్ మునిబ్ చెప్పారు.